Trending

6/trending/recent

RK Beach : విశాఖలో ముందుకొచ్చిన సముద్రం.. ఆర్కే బీచ్‌లో కుంగిన రోడ్డు

 జవాద్ తుఫాన్ ముప్పు త‌ప్పింద‌ని అనుకునేంతలోగా మ‌రో ముప్పు వ‌చ్చిప‌డింది. విశాఖ‌ ఆర్కే బీచ్‌ వద్ద స‌ముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో స్థానికుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

చిల్ట్రన్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది. పార్క్‌లోని బ‌ల్లలు ఒక పక్కకు ఒరిగిపోగా, ప్రహ‌రీగోడ కూలిపోయింది. పార్క్ బ‌య‌ట 10 అడుగుల మేర భూమి కుంగిపోయింది. అధికారులు అప్రమత్తమై పిల్లల పార్కుకు వచ్చే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. పార్కు వైపు ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. పార్కు వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. విశాఖ‌కు జ‌వాద్ తుఫాన్‌ ముప్పు తప్పింద‌ని చెప్తున్నప్పటికీ.. స‌ముద్రం ముందుకు రావ‌డంతో స్థానిక ప్రజలు ఆందోళ‌న చెందుతున్నారు.

RK Beach : విశాఖలో ముందుకొచ్చిన సముద్రం.. ఆర్కే బీచ్‌లో కుంగిన రోడ్డు


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad