Trending

6/trending/recent

Cyclone: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

Cyclone: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ శుక్రవారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
Cyclone: తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిపారు. మరి కొన్ని గంటల్లో తుఫానుగా మరే అవకాశం ఉందంటున్నారు. దీనికి మాల్దీవులు మిధిలి అనే పేరు పెట్టింది. శనివారం నాటికి నాటికి మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. ఈ వాయుగుండం తీరం దాటిన తరువాత ఈనెల చివరి నాటికి ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకొని రాష్ట్రమంతటా విస్తరించి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుంది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad