ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఆదివారం అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది.
Jawad Cyclone : ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఆదివారం అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. మరింత బలహీనపడుతూ బెంగాల్ వైపు పయనించి అక్కడే తీరం దాటే అవకాశం ఉంది. అయితే జొవాద్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముందే అప్రమత్తమైన అధికారులు 54వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జొవాత్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవనే హెచ్చరికలు ఆ ప్రాంత ప్రజలను తెగ టెన్షన్ పెట్టాయి. విశాఖకు సమీపంలోనే తుపాను తీరం దాటుతుందనే అంచనాలు కూడా ఆందోళన రేపింది. అయితే, వాతావరణంలో వచ్చిన మార్పులతో జొవాద్ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా కదులుతోంది. మరింత బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారనుంది.