Andra Pradesh:ఆ ఉత్తర్వులు ఇవ్వండి.. సీఎం జగన్‌కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పెషల్ రిక్వెస్ట్

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

జీతాలు, అలవెన్సుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ట్వీట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు విన్నవించారు.




  • చెరకు రైతుల సమస్యలపై లక్ష్మీనారాయణ ట్వీట్
  • రైతులకు చెల్లింపులు, కార్మికులకు జీతాలు ఇవ్వాలని
  • ముఖ్యమంత్రి జగన్, మంత్రి కన్నబాబుకు రిక్వెస్ట్
ఏపీలో చెరకు రైతుల కష్టాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. చెరకు రైతుల పెండింగ్ చెల్లింపులు.. ఏటి కొప్పాక, తాండవ, తుమ్మపాల & చోడవరం షుగర్ ఫ్యాక్టరీల కార్మికుల జీతాలు, అలవెన్సుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ట్వీట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు విన్నవించారు.

లక్ష్మీనారాయణ నాలుగు రోజుల క్రితం తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీల సమస్యలు తెలుసుకునేందుకు రైతులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. సహకార రంగంలోని తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఆదుకోవాలని, చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కాదని.. వాటి సామర్థ్యాన్ని మరింత పెంచి గాడిలో పెట్టాలని సూచించారు.

ఈ ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయిస్తే రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించవచ్చన్నారు. మరో కోటిన్నర రూపాయలు ఇస్తే ఓవర్‌ హాలింగ్‌ పనులు పూర్తిచేసి, క్రషింగ్‌ ప్రారంభించవచ్చని చెప్పుకొచ్చారు. రైతులు పెట్టుబడులు పెరిగిపోయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అన్నదాతల్ని ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని వ్యాఖ్యానించారు. రైతు కంట కన్నీరు వస్తే సమాజానికి మంచిదికాదన్నారు.

చెరకు రైతుల పెండింగ్ చెల్లింపులు మరియు ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల & చోడవరం షుగర్ ఫ్యాక్టరీల కార్మికుల జీతాలు మరియు అలవెన్సుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని గౌరవనీయులైన సిఎం & AP ప్రభుత్వానికి విన్నపం


Below Post Ad


Tags

Post a Comment

0 Comments