Trending

6/trending/recent

Govt School: సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!

ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలు... ఉన్నత చదువులకు దారి చూపే ఏదో కీలకమైన ప్రవేశ పరీక్షరాస్తున్నట్లుగా ఉంది కదూ.

Govt School: సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!

ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలు... ఉన్నత చదువులకు దారి చూపే ఏదో కీలకమైన ప్రవేశ పరీక్షరాస్తున్నట్లుగా ఉంది కదూ. కానీ ఇదంతా ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం..! సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు గురువారం పరీక్ష నిర్వహించగా.. ఏకంగా 650 మంది పిల్లలు హాజరయ్యారు. వారిని లోనికి పంపిన తల్లిదండ్రులు పరీక్ష ఎలా రాస్తారో, సీటు వస్తుందో.. రాదోనని పాఠశాల ఆవరణలో ఎదురుచూస్తూ చర్చించుకున్నారు. ఈ సర్కారు బడికి ఇంతటి డిమాండుకు... ఇక్కడి ఉత్తమ బోధన విధానాలే కారణం. ఈ పాఠశాల విద్యార్థులను ఇఫ్లూ దత్తత తీసుకొని విదేశీ భాషలు నేర్పిస్తోంది. జాతీయ ఉపకార వేతనాలు, పోటీ పరీక్షలు, నీట్, ఎప్‌సెట్‌ తరహా వాటికి చిన్ననాటి నుంచే సాధన చేయిస్తున్నారు. కంప్యూటర్‌ ఆధారిత అంశాలనూ బోధిస్తున్నారు. 6వ తరగతిలో 200, మిగతా తరగతుల్లో 50 చొప్పున సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రవేశ పరీక్షకు నిర్వాహకులు రెండు నెలల ముందు నుంచే దరఖాస్తులు స్వీకరించారు. గత విద్యాసంవత్సరం ఈ ఉన్నత పాఠశాలలో మొత్తం 1,208 మంది చదువుకున్నారు.

పాఠశాల బయట వేచిచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

పాఠశాల బయట వేచిచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad