Trending

6/trending/recent

Andhra Weather: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం పడే చాన్స్..

ఇది పిడుగు లాంటి వార్త. పిడుగులకు సంబంధించిన బ్రేకింగ్ వార్త. తొలకరి జల్లులు పడుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరసబెట్టి పడుతున్న పిడుగులు పదులకొద్దీ ప్రాణాల్ని కడతేరుస్తున్నారు. ఈ క్రమంలోనే అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల సంస్థ సూచించింది.

Andhra Weather: ఏపీకి బిగ్ అలెర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం పడే చాన్స్..

గోవా నుండి దక్షిణకోస్తా వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం పార్వతీపురంమన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి తిరుపతి జిల్లా చిత్తమూరులో 42.5మిమీ, దొరవారిసత్రంలో 42.5మిమీ, గుంటూరు జిల్లా మంగళగిరిలో 35మిమీ, పల్నాడు జిల్లా అమరావతిలో 31మిమీ, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 27మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

కాగా పిడుగుపాటును ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ దగ్గరుంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సెన్సార్లు ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడుతుందో ఓ అంచనాకు వస్తారు. ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అక్కడి జనాన్ని అప్రమత్తం చేస్తారు. పిడుగు పడబోయే అరగంట ముందే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఎత్తైన చెట్లు, భవనాలపైనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి.

వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు పిడుగుల బారి నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే.. నేరుగా పిడుగులను ఆకర్షించే తత్వం వాహనాలకు ఉండదు. సో.. పిడుగులు పడే సీజన్లో వాతావరణ శాఖ సందేశాల్ని సీరియస్‌గా తీసుకుంటూ, కాసింత అప్రమత్తంగా ఉంటే చాలు.. పిడుగుపాటు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నమాట.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad