Trending

6/trending/recent

Healthy Heart Tips : మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించండి..

Healthy Heart Tips గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం, గుండెజబ్బుల బారినపడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. 

Healthy Heart Tips

గుండెజబ్బులతో బాధపడేవారికి కరోనాజబ్బు తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టటం చూస్తున్నదే. కరోనాతో మరణించినవారిలో గుండెజబ్బులు గలవారి సంఖ్యా ఎక్కువగా ఉండటం తెలిసిందే. కానీ గుండెజబ్బుల మీద దశాబ్దాలుగా అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. జీవనశైలి పరమైన అలవాట్లు గుండె మీద ఎంతగానో ప్రభావం చూపుతాయన్నది ఇవన్నీ స్పష్టంగానే తెలియజేస్తున్నాయి. పొగ తాగడం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, చురుకుగా ఉండటం, బరువు తగ్గటం, రక్తపోటు అదుపులో ఉంచుకోవటం, కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును తగ్గించుకోవటం. ఈ ఏడు సూత్రాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Healthy Heart Tips - Tips

ఈ సూత్రాలు ఏమిటంటే.. 

మనలో చాలామంది కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్ల వంటివి అంతగా తిననే తినరు. వ్యాయామాలూ సరిగా చేయరు. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వేగంగా నడవటం వంటి ఒక మాదిరి తీవ్రమైన వ్యాయామం చేయాలన్నది నిపుణుల సిఫారసు. అలాగే వారానికి కనీసం 2 సార్లు బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయాలి. ఈ ఆహార, వ్యాయామ నియమాలు రెండింటిని పాటిస్తేనే బరువూ అదుపులో ఉంటుందనుకోండి. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్, గ్లూకోజు నియంత్రణలో ఉంటాయి. అందువల్ల కొన్ని చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టినా పెద్ద ఫలితమే కనిపిస్తుంది.

Healthy Heart Tips : మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించండి..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad