Boy World Record : మూడేళ్ళ వయసులో అద్భుత జ్ఞాపకశక్తి(Grasping power)ని ప్రదర్శిస్తూ రామాయణం(Ramayana)లో సంస్కృత శ్లోకాలను అలవోకగా వలిస్తూ రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు.
Boy World Record
అతి చిన్నవయసులో రామాయణ పారాయణం రాష్ట్రాల రాజధానుల పేర్లను టకా టకా చెబుతున్నాడు. మేధో సంపత్తి ఏ ఒక్కరి సొత్తు కాదు. దైవానుగ్రహం అది. అతి చిన్న వయసులో రామాయణాన్ని ఆసాంతం అలవోలకగా వల్లించడం సాధారణ విషయం కాదు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడు గ్రామం చెందిన పెనుమర్తి వెంకటరాజు సరోజినీ దేవి ఏకైక కుమారుడు ముని కార్తీక్ మూడేళ్ల వయసులో అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఏ ప్రశ్న వేసిన టక్కున సమాధానం ఇస్తున్నాడు.
మూడేళ్ల చిచ్చరపిడుగు పెనుమర్తి కార్తీక్ ఇట్టే సంస్కృత శ్లోకాలు వల్లిస్తాడు. రామాయణంలో 100 ప్రశ్నలు రూపొందించి వాటికి సమాధానాలు అలవాటు చేయగా వారం రోజుల్లోనే పూర్తిగా నేర్చుకోవడం మొదలు పెట్టాడని కార్తీక్ తల్లి సరోజినీదేవి తెలిపారు. సీతారాముల జీవిత చరిత్రకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇస్తాడు. గజిబిజి పద్దతిలో పలు ప్రశ్నలు అడగినా అన్నింటికి బాలుడు కార్తీక్ చక్కగా సమాధాన మిచ్చి.. అందరినోట హౌరా అనిపించుకుంటున్నాడు.
Boy World Record
ఇప్పటికీ అతి పిన్న వయసులోనే సాధారణ జ్ఞానం కలిగిన చిన్నారిగా ఛాంపియన్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత్ టాలెంట్స్ అవార్డ్స్‌లో స్థానం సాధించాడు. స్థానికంగా మరో మూడు అవార్డులు సత్కారాలు సాధించాడు. అతి చిన్న వయసులో ఊరికి పేరు తీసుకు రావడం పట్ల పలువురు గ్రామ ప్రముఖులు చిన్నారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఎనిమిది నెలల వయసులో కార్తీక్ జ్ఞాపకాన్ని తన గుర్తించడం జరిగిందని ఏదో ఒక క్రీడలో తన కుమారుని ఒలింపిక్స్ పంపించాలని తన ఆశయమని కార్తీక్ తల్లి వెల్లడించారు. భవిష్యత్తులో తమ కార్తీక్ ను ఉన్నత స్థానంలో చూడాలని కార్తీక తల్లి సరోజినీ దేవి తెలిపారు.