Children Vaccination Guidelines : 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కార్బెవ్యాక్స్(Carbevax) టీకా మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
Children Vaccination Guidelines
దేశవ్యాప్తంగా బుధవారం(రేపు) నుంచి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… కార్బెవ్యాక్స్ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు 28 రోజుల వ్యవధి ఉండాలి. 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలందరూ కొవిన్ పోర్టల్(Covin)లో టీకా కోసం రిజిస్టర్ చేసుకోవాలి. 12 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ వేస్తున్నట్లు టీకా వేసేవారు నిర్ధరించుకోవాలి. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వయసు 12 ఏళ్లు పూర్తి కాని పిల్లలకు టీకా వేయకూడదు. కొవిన్‌లో ఖాతా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా కోసం అందులోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా టీకా కేంద్రాలకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇతర టీకాలు ఇచ్చే అవకాశం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Children Vaccination Guidelines
14-15 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. వీరంతా కొవాగ్జిన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారందరూ మార్చి 16 నుంచి బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే మూడో డోసు తీసుకోవాలి. మొదటి రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకుంటే దాన్నే కొనసాగించాలి.