TTD Alerts:తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ టోకెన్లను వెంటనే రీ షెడ్యూల్ చేయండి.

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంతో కొంతమంది భక్తులు తిరుమల రాలేకపోయారని.. ఆరునెలల్లోపు దర్శన స్లాట్‌లను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలు కల్పించామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

  • తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అవకాశం
  • టోకెన్లు రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు
  • వర్షాల కారణంగా తిరుమల రాని వారికి ఛాన్స్
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ రీ షెడ్యూల్ అవకాశం కల్పించింది. నవంబరు 18 నుంచి ఈ నెల 10 వరకు వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శనం డేట్‌ను రీషెడ్యూల్‌ చేయొచ్చన్నారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంతో కొంతమంది భక్తులు తిరుమల రాలేకపోయారని.. ఆరునెలల్లోపు దర్శన స్లాట్‌లను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలు కల్పించామని ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి రీ షెడ్యూల్ చేసుకోవాలని కోరారు.

మరోవైపు భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడి తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్ ఘాట్ రోడ్డులో ప్రయాణాలను నిషేధించిన టీటీడీ.. కింది ఘాట్ రోడ్డులో వాహనాలను అనుమతించింది. దీంతో ప్రయాణికులు ఎక్కువ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది.. దీంతో ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునఃనిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అప్ ఘాట్‌లో ఇటీవల విరిగిపడిన భారీ కొండ చరియల్లో మిగిలిన సగ భాగం రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రమాదకరంగా ఉన్న కొండ చరియలను గుర్తించి కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి తొలగించాలని ఆదేశించారు.

డౌన్ ఘాట్ రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందున అలిపిరి, లింక్ బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని.. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోనే రెండో ఘాట్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు చేపడతామని వైవీ తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ టోకెన్లను వెంటనే రీ షెడ్యూల్ చేయండి.


Below Post Ad


Tags

Post a Comment

0 Comments