Covid-19:కోవిడ్ మొదలైన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు.. పసిఫిక్ దీవిలో కలవరం.

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి... మరోసారి కొత్త రూపంలో వణికిస్తోంది. అయితే, రెండేళ్ల తర్వాత ఓ దేశంలో తొలి కేసు నమోదుకావడం విశేషం.

  • డిసెంబరు 2019లో వెలుగుచూసిన కరోనా వైరస్.
  • న్యూజిలాండ్ నుంచి వచ్చిన బాలుడికి పాజిటివ్.
  • తొలిసారి పాజిటివ్ కేసు నమోదయినట్టు ప్రకటన.
దక్షిణ పసిఫిక్‌లోని కుక్ ఐలాండ్స్‌లో తొలి కరోనా కేసు నమోదయినట్టు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి మొదలైన దాదాపు రెండేళ్ల తర్వాత ఆ దీవుల్లో కోవిడ్ కేసు నిర్దారణ కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దాదాపు 17,000 మంది జనాభా ఉన్న ఈ దీవిలో.. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ రేటు ఉంది. టీకాకు అర్హులైనవారిలో 96 శాతం మందికి రెండు డోస్‌లు పూర్తయ్యింది. కరోనా వ్యాప్తితో సరిహద్దులను మూసివేసిన కుక్ ఐలాండ్ ప్రభుత్వం పర్యాటకాన్ని పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ తరుణంలో తొలిసారి కోవిడ్ కేసు నమోదుకావడంతో ఆందోళన చెందుతోంది. గురువారం స్వదేశానికి వచ్చిన విమానంలోని 10 ఏళ్ల బాలుడికి వైరస్ నిర్ధారణ అయినట్టు కుక్ ఐలాండ్ ప్రధాని మార్క్ బ్రౌనే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలుడు తల్లి తన సోదరులతో కలిసి న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తెలిపారు. బాలుడి తల్లి వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకుందని, ముగ్గురు పిల్లలు వ్యాక్సిన్‌కు అర్హులు కాకపోవడంతో టీకా తీసుకోలేదన్నారు. ప్రయాణానికి ముందు నవంబరు 30న బాలుడికి ప్రయాణానికి ముందు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందన్నారు.

అయితే, ఇక్కడకు వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. మొత్తం విమానంలో 176 మంది రాగా.. పదేళ్ల చిన్నారికే వైరస్ నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. దీంతో బాలుడి కుటుంబాన్ని ఓ రిసార్ట్‌లో క్వారంటైన్‌లో ఉంచామన్నారు. కుటుంబసభ్యుల్లో ఎవరికీ కోవిడ్ లక్షణాలు కనిపించలేదని వివరించారు.

‘మా సరిహద్దులను తిరిగి తెరవడానికి మేము సిద్ధం చేస్తున్నాం... సరిహద్దుల వద్ద ఈ కేసును గుర్తించడం ద్వారా మా పరీక్షా విధానాలు సన్నాహక ప్రయత్నాలను చూపించాయి’ అని ప్రధాని తెలిపారు. కరోనా వ్యాప్తితో సరిహద్దులను మూసివేసిన కుక్ ఐలాండ్.. జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో ఎటువంటి ఆంక్షలు లేని ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఇటీవలే ప్రకటించింది.

ఈ ఏడాది ఆరంభంలో ఆక్లాండ్‌లో వైరస్ వ్యాప్తి చెందడంతో న్యూజిలాండ్‌తో స్వల్పకాలిక ట్రావెల్ బబూల్‌ ఒప్పందం చేసుకుంది.

ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి... మరోసారి కొత్త రూపంలో వణికిస్తోంది. అయితే, రెండేళ్ల తర్వాత ఓ దేశంలో తొలి కేసు నమోదుకావడం విశేషం.



Below Post Ad


Tags

Post a Comment

0 Comments