- సీఎం సానుకూలం
- త్వరలోనే పీఆర్సీ
- నాలుగు రోజులు ఆగలేరా
- ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి
మార్కెటింగ్ శాఖలో ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వా లనే డిమాండ్ను ప్రభుత్వం లో త్వర లో పరిష్కరించనుంది. మార్కె టింగ్ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులు, పెన్షనర్లకు 010 పద్దు కింద వేత నాలు చెల్లించేందు కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించటంతో పాటు అధికారులు సమర్పించిన ప్రతిపాద నలను గురువారం ఆమోదించారు. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మీడియాకు వివరించారు. మార్కెటింగ్ ఉద్యో గులు ఎంతో కాలంగా ఈ సమస్య పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నారని సీఎం ఆమోదించటంతో ఉద్యోగు లకు వెసులుబాటు కలుగుతుంద న్నారు. ఇందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీని పది రోజుల్లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తిరుపతిలో ప్రకటించినా కొన్ని సంఘాలు రెచ్చకొట్టే తీరున వ్యవహరించటం సమంజసం కాదన్నారు. దీనిపై 3, 4 రోజుల్లో ప్రకటన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పీఆర్సీ కోసం ఇన్ని రోజులు ఆగాం.. మరో నాలుగు రోజులు ఆగలేరా అని ఆందో ళన నిర్వహిస్తున్న సంఘాల నేతలనుద్దేశించి ప్రశ్నించారు. ఎన్జీ వోల సంఘం మాజీ అధ్యక్షుడికి పదవి వచ్చేంత వరకు ఖాళీగా ఉన్న వారు పదవి వచ్చాక ఆందోళనలు చేయటం తగదన్నారు. గురువారం పీఆర్సీపై సీఎంకు నివేదిక అందజేశారని తెలిపారు.