నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గురువారం ఆయన నూజివీడు ఎమ్మెల్యే ఎంవీ ప్రతాప్ అప్పారావుతో కలిసి కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, నిర్మాణం పూర్తయ్యే వరకు తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయ భవనా నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక తరగతి గదుల్లో తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. నిర్మాణానంతరం తరగతులు విద్యాలయ క్యాంపస్‌లోకి మారుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఎంప్లాయీస్ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పాఠశాలలో తాత్కాలిక తరగతులు నిర్వహిస్తామని, రూ.80లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, వైస్ ఛైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్ శీలం రాము, మున్సిపల్ డీఈఈ లక్ష్మీ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Central University: నూజివీడులో త్వరలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు
December 10, 2021
0
Tags