Trending

6/trending/recent

Municipal Teachers: పురపాలక టీచర్ల నిరసనలు విజయవంతం

పురపాలక పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల తరగతుల విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ టీచర్లు చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన విలీన ప్రక్రియను పంచాయతీ పాఠశాలలకు లాభంగాను.. పట్టణాలలో ఆచరణ ఆమోదయోగ్యం కాని నిబంధనలతో తయారు చేశారని టీచర్లు పేర్కొన్నారు. గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమాలలో 13 జిల్లాల్లోని అన్ని పురపాలక పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ పురపాలక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీన కార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పురపాలక హైస్కూల్ పాఠశాలలు ఇప్పటికే కిక్కిరిసిన తరగతి గదులతో 800 నుంచి 1000 మంది విద్యార్థులతో నిండిపోయి ఉన్నాయన్నారు. అలాంటిది ప్రాథమిక పాఠశాలల నుంచి కొత్తగా వచ్చే వందలాది మంది విద్యార్థులకు స్థలం, వసతి సౌకర్యాలు, టీచర్లను నియమించడం వంటివి సాధ్యం కానివని తేల్చి చెప్పారు. ఈ విలీన కార్యక్రమం పట్టణ, నగర పాఠశాలలకు నష్టం చేకూర్చే విధంగా ఉంటోందన్నారు. దీనిపై మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాలలో మున్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొని, తమ నిరసనను రాష్ట్ర ప్రభు త్వానికి, విద్యాశాఖకు తెలియజేశారు. కనుక దీనిపై పునఃపరిశీలించి తగు పురపా లక పాఠశాలలో విలీన ప్రక్రియ నిలుపుదల చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad