- సంఘాల ప్రకటన .. ‘సర్కారు క్రీడ
- రాజీనా? పోరాటమా? అన్నది తేలాలి
- ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు ఆగ్రహం
- డిసెంబరు తర్వాత ఉద్యమ కార్యాచరణ
పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటికైనా నోరు విప్పాలని, ఉద్యోగుల్లో నెలకొన్న అయోమయం తొలగించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ఉద్యోగ సంఘాల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో తమ సంఘానికి సంబంధం లేదని తెలిపారు. ఈ సంఘాల ప్రకటనలు ప్రభుత్వ క్రీడలో భాగమేనని విమర్శించారు. ‘పీఆర్సీపై ముఖ్యమంత్రి తేల్చేస్తార’న్న ఒక సంఘం నాయకుని ప్రకటనపై ఉద్యోగులకు నమ్మకం లేదని.. పరోక్షంగా ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీరును విమర్శించారు. 11వ పీఆర్సీ కమిషనర్ అసుతోష్ మిశ్రా కేవలం 23ు ఫిట్మెంట్ మాత్రమే ప్రకటించారని, ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా 27ు ఐఆర్ అమలు చేస్తున్నందున దాన్నే ఫిట్మెంట్ అనుకోవచ్చని సీఎస్ గత నెల 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారని తెలిపారు. ‘‘ఇంత జరిగినప్పటికీ ఉద్యోగ సంఘాలకు నాటకాలెందుకు? ఆ సమావేశంలో వారు లేరా?’’ అని ఆస్కార్ రావు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో రాజీనా? పోరాటమా? అన్నది ఉద్యోగులు తేల్చుకోవాలన్నారు. తమ సంఘం ముందుగా ప్రకటించినట్టు ప్రభుత్వానికి డిసెంబరు 31 వరకు సమయం ఇస్తున్నామన్నా రు. ఆ తర్వాత ప్రణాళికా బద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.