SBI New Rules: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 SBI New Rules: అతిపెద్ద దేశీయ‌ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? తరుచుగా బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. 

ఈ కరోనా టైంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు విత్ డ్రాకు సంబంధించిన పలు కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది.

రోజూవారి నగదు విత్ డ్రా చేసే పరిమితిని పంచింది. వేరొక శాఖ(హోం బ్రాంచ్ మినహా)లో ఖాతాదారులు విత్ డ్రా ఫారం సహాయంతో తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ. 25 వేల వరకు నగదును ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది. అదే చెక్ రూపంలో అయితే మరో బ్రాంచ్ నుంచి రూ. 1 లక్ష వరకు తీసుకోవచ్చునని వెల్లడించింది. అలాగే థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని కూడా రూ. 50 వేల వరకు పెంచింది. ఈ కొత్త రూల్స్ తక్షణమే అమలులోకి వచ్చినట్లు పేర్కొన్న ఎస్‌బీఐ.. 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇవి వరిస్తాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే త్రిడ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు విత్ డ్రా చేయడం కుదరదని.. థర్డ్ పార్టీ కేవైసీ డాక్యుమెంట్ అవసరమని బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. కాగా, ఎస్‌బీఐ ప్రతీ నెలా తన ఖాతాదారులకు 8 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరేశాఖ) లావాదేవీలను అందిస్తోంది. అలాగే నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరే బ్యాంకుల ఏటీఎంల) లావాదేవీలు ఉన్న సంగతి తెలిసిందే.



Below Post Ad


Post a Comment

0 Comments