Cabinet Meeting: నేడు మంత్రిమండలి సమావేశం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • కీలక అంశాలపై చర్చ

Cabinet Meeting: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచి వాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగనుంది. సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా గురువారం నుంచి రాష్ట్రం లో కర్ఫ్యూ సడలింపు, కోవిడ్ తాజా పరిస్థితులు, నివారణకు ప్రభుత్వం చేబడుతున్న కార్యక్రమాలు, వాక్సినేషన్ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే జూలై నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై సమీక్ష జరుగనుంది. దిశా చట్టం అమలుపై క్యాబినెట్ లో చర్చకు రానుంది. ప్రధాన సమస్యగా మారిన తెలంగాణ జలవివాదం పైనా చర్చించే అవకాశం ఉంది. కొత్త ఐటీ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకు ఆమోదం క్యాబినెట్ తెలపనుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పై వస్తున్న నిరసనలపై క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్నమండలి చైర్మన్,వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యేకంగా శాసనమండలి సమావేశం నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యా సంస్థల పునః ప్రారంభం, అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులు తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.



Below Post Ad


Post a Comment

0 Comments