Tauktae Cyclone: ఒకవైపు కరోనా కల్లోలం.. మరోవైపు ‘తౌటే’ తుఫాన్ బీభత్సంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులు పడుతుంటే.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈ నెలాఖరును హిందూ మహాసముద్రంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఇదిలా ఉంటే ‘తౌటే’ తుఫాన్ ఐదు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
అండమాన్ నికోబార్-సుమత్రా హిందూ మహాసముద్రం-బంగాళాఖాతం సముద్రపు నీరు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా.. సముద్ర మట్టానికి పైన ఉన్న ఉష్ణోగ్రత దానికి వ్యతిరేకంగా ఉందని.. హిందూ మహాసముద్రంలో ఈ నెలాఖరు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్న వాతావరణ శాస్త్రవేత్త ఈ నెలాఖరుకు మరో తుఫాన్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ వారం చివరి నాటికి హిందూ మహాసముద్రం తుఫానులకు అనుకూలమైన వాతావరణంగా మారుతుందని చెబుతున్నారు.