Today Gold Rates: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కూడా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే.. బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గుతుంటే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టిపెడుతుంటారు. అయితే.. దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. నెల క్రితం 40వేల చేరువలోకి వచ్చిన ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 310 రూపాయలు పెరిగింది. దీంతో బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం.. 45,640 కి పెరిగింది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,810 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 50,710 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,640 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,640 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,590 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.