Trending

6/trending/recent

Andhra Pradesh: ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ వ్యాధి.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

 కరోనా ఉద్ధృతి ఇంక తగ్గక ముందే మరో వ్యాధి మన దేశాన్ని వణికిస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో జనాల్లో ఆందోళన నెలకొంది. మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బ్లాక్ ఫంగస్ వ్యాధికి అందించే చికిత్సను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. బ్లాక్ ఫంగస్‌‌కు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ.. ఆరోగ్యశ్రీ వర్తించే వెసలుబాటును కల్పించారు.

బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే.. అది ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తుంది. కాగా, ఇప్పటి కరోనా వైరస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం.

బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు 1600 యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ల వయల్స్‌ను ఏపీకి కేటాయించింది కేంద్రం. ఐతే ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఏపీలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. మొదట శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత గుంటూరులో 4, తూర్పుగోదావరి 3, ప్రకాశం 1, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, పశ్చిమగోదావరిలోనూ లక్షణాలున్నవారిని ఇప్పటికే గుర్తించారు. ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు సమాచారం.

కొవిడ్‌ బాధితుల్లో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోంది. ఎక్కువగా ఐసీయూలో ఉండడం, ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ వాడే వారిలో ఎక్కువగా బ్లాక్‌ ఫంగస్‌ బయటపడుతోందని వైద్యులు చెబుతున్నారు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad