Trending

6/trending/recent

AP Coronavirus Cases: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి… కొత్తగా 109 మంది మృత్యువాత..పాజిటివిటీ రేటు 25%

 AP Coronavirus Cases: ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18వేలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 73,749 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,561 మందికి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 14,54,052 మందికి కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 109 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,481కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 17,334 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 12 లక్షల 33 వేల 017 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 2,11,554 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,80,49,054 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, 14,54,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కోవిడ్ బారినపడి కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 16 మంది ప్రాణాలను కోల్పోయారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పదేసి మంది చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో 9మంది, విశాఖపట్నం జిల్లాలో 9మంది, కృష్ణా జిల్లాలో 8, నెల్లూరు జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 4, కడప జిల్లాలో ముగ్గురు కరోనా బాధితులు కన్నుమూశారు.




Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad