Twinning of Schools: పాఠశాలల కలయిక, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలను అనుసంధానం చేస్తూ అర్బన్‌, సెమి అర్బన్‌ , రూరల్‌ ఏరియాలలోని విద్యార్థులలో పరస్పర జ్ఞాన సముపార్దన,మేదోమధనం మరియు భావ వ్యక్తీకరణ పెంపొందించడం ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

అభివృద్ధి పథములో ఉన్న ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలను పట్టణ/నగర ప్రాంతములోని పాఠశాలను గ్రామీణ ప్రాంత పాఠశాలలకు భాగస్వామ్యము చేసి ఆ ప్రాంత పాఠశాలలను ప్రత్యక్షేకరణం చేయడం, ఇదే విధంగా గ్రామీణ ప్రాంత పాఠశాలలను నగర పాఠశాలలకు తీసుకెళ్ళి వారం రోజులు పాటు విద్యార్ధులలో జ్ఞానం మరియు భావ వ్యక్తీకరణంను ప్రోత్సహించడం ఈ కార్యక్రమములో భాగం 

విద్యార్థులకు నిర్దేశిత వయసు, తరగతులు మరియు పాఠశాలలు

నిర్దేశిత వయసు 2 6 నుండి 18 సంవత్సరములు
నిర్దేశిత తరగతులు ౩; 1నుండి 8వ తరగతి వరకు
నిర్దేశిత పాఠశాలలు : రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎయిడెడ్‌ మరియు ప్రైవేటు పాఠశాలలు

పాఠశాలలను ఎంపిక చేయు విధానం:

గ్రామీణ మరియు నగర ప్రాంతం నుండి రెండు పాఠశాలలని ఎంపిక చేస్తారు. ఈ పాఠశాలల
సమాచారం సేకరించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిశీలించాలి.

పాఠశాలలో మౌళిక వసతులు త్రాగు నీరు, మరుగు దొడ్డు, ఆధునిక వసతులు ( కంప్యూటర్‌,
డిజిటల్‌ తరగతి) బోధనోపరణాలు, ఆట స్ధలం, క్రీడా పరికరాలు కలిగిన పాఠశాలలని ఎంపిక
చేయాలి.

బహుముఖ పరిజ్ఞానం మరియు నైపుణ్యముగల సిబ్బందిని ప్రోత్సహించాలి

పచ్చదనం, స్వచ్చత, శుభ్రత ఉన్న పాఠశాలలని ఎంపిక చేయాలి.

ప్రయాణ సౌకర్యము, వసతి (హాస్టల్‌ సౌకర్యము ఉన్న పాఠశాలలని ఎంపికచేసుకోవాలి.

మరిన్ని వివరాల కొరకు ఈ మాడ్యూల్ ను డౌన్లోడ్ చేసుకొండి

Below Post Ad


Post a Comment

0 Comments