LIC Policy | మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎల్ఐసీలో అనేక పాలసీలు ఉన్నాయి. అయితే ఎల్ఐసీలో లేని పాలసీలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అసలు పాలసీల గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి.
1. ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ... ఈ పాలసీ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా యాడ్ చూశారా? అసలు ఎల్ఐసీలో కన్యాదాన్ పేరుతో పాలసీ లేనే లేదు. కానీ మార్కెట్‌లో మాత్రం ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ చాలా పాపులర్.
2. కేవలం నెలకు రూ.121 చొప్పున పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి లేదా ఉన్నత చదువుల కోసం రూ.27 లక్షల రిటర్న్స్ పొందొచ్చని చెబుతుంటారు. కానీ మీరు ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో చూస్తే 'కన్యాదాన్' పాలసీ కనిపించదు. మరి ఇదంతా మోసమా అంటే మోసం కూడా కాదు. పాలసీ పేరు మాత్రం వేరు.
3. ఎల్ఐసీలో ఉన్న జీవన్ లక్ష్య పాలసీనే కన్యాదాన్ పాలసీగా ప్రచారం చేస్తుంటారు. పేరు మాత్రమే వేరు. బెనిఫిట్స్ మాత్రం దాదాపుగా అవే. అయితే ఎక్కడ కూడా రోజుకు రూ.121 పొదుపు చేస్తే రూ.27 లక్షలు రిటర్న్స్ వస్తాయన్న ఉదాహరణ లేదు.
4. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో ఉన్న జీవన్ లక్ష్య పాలసీ సేల్స్ బ్రోచర్‌లో ఉన్న వివరాలు చూద్దాం. ఎల్ఐసీ జీవన్ లక్ష్య నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ ప్లాన్ ఇది. ఇందులో కనీసం రూ.1,00,000 బీమా ఎంచుకోవాలి. గరిష్టంగా ఎంతవరకైనా పాలసీ తీసుకోవచ్చు.
5. పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్టంగా 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీ వయస్సు గరిష్టంగా 65 ఏళ్లు. ఇక పాలసీ గడువు 13 ఏళ్ల నుంచి 25 ఏళ్లు ఉంటుంది.
6. మెచ్యూరిటీ సమయంలో సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్ కూడా లభిస్తుంది. యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఉంది. ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీలో ఎంత పొదుపు చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో ఎల్ఐసీ వివరించింది.
7. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 25 ఏళ్లకు పాలసీ తీసుకుంటే 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. మొదటి ఏడాది ట్యాక్స్‌తో కలిపి రూ.4677 చెల్లించాలి.
8. రెండో ఏడాది నుంచి 21 ఏళ్లు రూ.4577 చొప్పున చెల్లించాలి. 22 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.1,00,794 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.1,00,000 సమ్ అష్యూర్డ్+రూ.1,22,500 బోనస్+రూ.33,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. అంటే మొత్తం రూ.2,55,500 వస్తుంది.
9. ఒకవేళ రూ.10,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఇదే కాలానికి పాలసీ తీసుకుంటే మొదటి ఏడాది ప్రీమియం రూ.43,638, ఆ తర్వాత ఏడాది నుంచి రూ.42,699 చొప్పున చెల్లించాలి. అంటే 22 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.9,40,317 అవుతుంది.
10. రిటర్న్స్ చూస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.10,00,000 సమ్ అష్యూర్డ్+రూ.12,25,000 బోనస్+రూ.4,50,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది. మొత్తం కలిపి రూ.26,75,000 వరకు పొందొచ్చు.
11. మార్కెట్‌లో ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీనే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ పేరుతో ప్రచారం చేస్తుండటంతో బాగా పాపులర్ అయింది. మధ్యతరగతి ప్రజల్లో అమ్మాయి పెళ్లికి, ఉన్నత చదువులకు డబ్బులు పొదుపు చేయడం అలవాటే. అందుకే అదే లక్ష్యంతో ఈ పాలసీలో పొదుపు చేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.
i want this policy i am intersted
ReplyDelete