- ఏడాదిగా డెడ్‌లైన్స్ పొడిగింపు
- సర్వర్ పనిచేయక అవస్థలు
- ఇప్పటికీ 25 శాతమే పూర్తి
న్యూస్ టోన్, అమరావతి; రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ చేందుకు ప్రారంభించిన ఎలక్టానిక్ సర్వీస్ రిజిస్మ్(ఈ-ఎస్సార్) నమోదు ఒక అంతులేని కథలా మారింది. దాదాపు ఏడాది కాలంగా డెడ్‌లైన్లు పొడిగించుకుంటూ. వస్తున్నా... నేటికీ 25 శాతానికి మించి పూర్తి కాలేదంటే పరిన్మితి ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, ఇతర అన్ని లావాదేవీలను ఒకే గొడుగు కింద నిర్వహించేందుకు కాంప్రహెన్సివ్ ఫైనాన్నియల్ మేనేజ్‌మెంట్ సిస్త(పేఎఫ్‌ఎంఎస్)ను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగులుదరూ ఈ-ఎస్సార్‌ను నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ దాదాపు ఏడాది క్రితమే ప్రారంభమైనప్పటికీ ఒక అడుగు, ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లు సాగుతూనే వస్తోంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉద్యోగుల సర్వీస్, సెలవలు, ఇంక్రిమెంట్లు, వ్యక్తిగత సమాచారం తదితర 11 రకాల అంశాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది కరోనా కారణంగా తీవ్ర జాప్యం జరగగా... అన్‌లాక్ ప్రక్రియలు ప్రారంభమైన తర్వాత కూడా సర్వర్ పని చేయకపోవడం, ఉద్యోగులు నమోదు చేయాల్సిన అంశాలు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల అలస్యమవుతూ వస్తోంది. ఈ క్రమంలో అన్ని అంశాలను పూర్తిగా నమోదు చేసిన వారి సంఖ్య 25 శాతంలోపుగానే ఉంది.
ఈ-ఎస్సార్ నమోదు ప్రక్రియ కోసం ప్రభుత్వం ఎప్పటి కప్పుడు డెడ్‌లైన్లు పొడిగిస్తూనే వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ... అప్పటికి ఒక్క ఉద్యోగి సమాచారం కూడా పూర్తిస్థాయిలో నమోదు. కాకపోవడంతో అప్పటి నుంచి ఏడాదిగా పొడిగించుకుంటూనే వస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా, సులభతరంగా, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో. తీసుకొచ్చిన వ్యవస్యతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఈ సమస్యల పరీష్కారం కోసం ఉద్యోగులు సీఎఫ్‌ఎంఎస్ వారికి సర్వీస్ రిక్వెస్సఎస్‌ఆర్టీ) పెట్టాల్సి ఉంటుంది.
అయితే అనేక మంది ఎస్‌ఆర్జీలు పెట్టి నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యలపై మాట్లాడేందుకు కాల్ సెంటర్ కూడా లేకపోవడంతో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. జిల్లాకు ఒకరిద్దరు ఉద్యోగుల నెంబర్లు కేటాయిం చీనట్టు చెప్పెనప్పటికీ వారీ నుంచి కూడా స్పందన లభించక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
నేపథ్యంలో ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎస్సార్ నమోదు గడువును మరింత పొడిగించడంతోపాటు, అనవసరమైన అంశాలను తగ్గించాలని కోరుతున్నాయి.
మూలాలు గుర్తిన్చరా..
రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు సర్వీసుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రత్ నెలా ఒకటో తేదీన టన్చన్‌గా వేతనాలు జారీ చేయడం, ఉద్యోగ విరమణ సమయంలో అన్ని రకాల బెనిఫిట్స్ అందించేలా ఈ-ఎస్సార్ ఉపయోపడుతుంది. అందుకోసరి రాష్ట్రంలోని ఐదు లక్షల ' వేల మందికిపైగా ఉద్యోగులు, అధికారుల వివరాలను ఈ ఎస్సార్ లో నమోదు చేయాలని ఆదేశించింది. అయితే ఈ-ఎస్సార్ నమోదు పూర్తి కాకపోవడంతో డెడ్‌లైన్లు అయితే పొడిగిస్తున్నారు కానీ సమస్య మూలాలను మాత్రం గుర్తించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు అవసరం లేని అంాలను తొలగించాలని, సర్వర్ వేగం పెంచి, ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, సర్వీస్ త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థనే తీసుకురావాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్. రామకృష్ణకోరారు.
డేటా లేని బయోమెట్రిక్!
ఈ-ఎస్సార్ సమస్య అలా ఉంటే... ఉపాధ్యాయుల హాజరు, నమోదు కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ వ్యవసృపరిన్నితి మరోలా ఉంది. రాష్ట్రంలోని పాఠశాలల్లోని బయోమెట్రీక్ యంత్రాలకు డేటా చార్జీలను విద్యాశాఖ మంజూరు చేయడం లేదు. దీంతో కొంత కాలం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆ ఖర్చు భరించినా... తర్వాత్తర్వాతతమకెందుకులే అన్నట్లు ఊరుకుంటున్నారు. దీంతో ఎవరికి వారు తమ సెల్‌ఫోన్‌లో హాట్ స్పాట్ ఆన్ చేసుకుని వేలిముద్ర వేసి, తమ పనులు చూసుకుంటున్నారు. అందువల్ల హాజరు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతోపాటు, సీగ్నళ్లు లేని ప్రాంతాల్లో గంటలతరబడి నిరీక్షంచాల్సి వస్తోంది. విద్యావ్యవస్యన బాగు చేసేందుకు ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను కేటాయిస్తూ... ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటం విమర్శలకు కారణమవుతోంది. విద్యాశాఖ ఇకనైనా స్పందించి బయోమెట్రిక్ యంత్రాలకు డేటా చార్జీలు మంజూరు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చేబోలు శరత్ చంద్ర, వెంకటరావు విజ్ఞప్తి చేశారు.