Security Password: వస్తువైనా, డివైజ్ అయినా, సోషల్ మీడియా యాప్స్ అయినా.. ఏదైనా సరే ముందుగా మనం వాటి సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం. ఫోన్ కొనుగోలు చేసినా.. కంప్యూటర్ కొనుగోలు చేసినా, మరేదైనా ఎలక్ట్రానిక్ డివైజ్ కొనుగోలు చేసినా వాటికి సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా, ఇతర యాప్స్‌కు కూడా పాస్‌వర్డ్ పెట్టుకుంటాం. అయితే, మనం ఎంత సెక్యూరిటీ పాస్‌వర్డ్ పెట్టుకున్నా కొన్ని కొన్ని సార్లు హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. అలా హ్యాకింగ్‌కు గురవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం అని ఓ సర్వే సంస్థం తేల్చింది. మరి మనం చేసే తప్పులేంటి?.. ఆ సర్వే సంస్థ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా నోబిఫోర్ అనే అధ్యయన సంస్థ పాస్‌వర్డ్ వినియోగంపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వ్యక్తులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే యాప్‌లు, డివైజ్‌లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని తేల్చింది. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే.. 24 శాతం మంది ఉద్యోగులు తమ పాస్‌వర్డ్‌లను తాము వాడే డివైజ్‌లలో సేవ్ చేస్తారట. కారణం మళ్లీ మళ్లీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ఎందుకు అని భావించటం ఒక కారణమైతే.. పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టంగా భావించి.. ఒకేసారి సేవ్ చేస్తారట. అలా చేయడం ద్వారా నేరుగా లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉందని సదరు వ్యక్తుల అభిప్రాయం అట. అయితే, ఇది అంత సురక్షితం కాదని సదరు అధ్యయన సంస్థ హెచ్చరిస్తుంది. ఇలా సేవ్ చేయడం ద్వారా హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను పసిగట్టి, యాక్సెస్ చేసుకునే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇంకా.. సులభమైన పాస్‌వర్డ్‌ను పెట్టి, ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ ప్రాంతాల్లో వినియోగించడం వల్ల హ్యాకర్ల పని మరింత సులభతరం చేసినట్లు అవుతుందని నోబీఫోర్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ కై రోయర్ హెచ్చరించారు.
ప్రపంచ వ్యాప్తంగా 1,60,000 మందిని పాస్‌వర్డ్ అంశంపై అధ్యయనం చేసినట్లు నోబీఫోర్ అధ్యయన సంస్థ పేర్కొంది. దాదాపు నలుగురిలో ముగ్గురు వ్యక్తులు పాస్‌వర్డ్‌ను పదే పదే టైప్ చేయకుండా సేవ్ చేసిపెట్టుకుంటారని తేల్చింది. ఇదే సమయంలో ఇతర సర్వేలు 25 శాతం కంటే తక్కువ మంది తమ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్‌ని ఉపయోగిస్తున్నట్లు తేల్చాయి.
‘‘మనలో చాలామంది ఆన్‌లైన్ సేవలు, ఇతర పనుల కోసం ఇంట్లో, పని చేసే చోట ఒకే విధమైన పాస్‌వర్డ్స్ వినియోగిస్తుంటారు. అయితే, ఇలా అన్నిచోట్లా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఇది మీ ఖాతాలను హ్యాకర్లు యాక్సెస్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది.‘’ అని రోయర్ వివరించారు. ఇక కొన్నేళ్లుగా పలు కంపెనీలు, తమ ఉద్యోగులకు పాస్‌వర్డ్స్ విషయంలో కీలక సూచనలు చేస్తున్నాయని, సంక్లిష్టమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నాయని రోయర్ చెప్పుకొచ్చారు. అయితే క్లిష్టంగా ఉండే పాస్‌వర్డ్‌లను గుర్తించుకోవడం కష్టం అవుతుండటంతో చాలా మంది ఉద్యోగులు తమ పాస్‌వర్డ్‌లను తిరిగి ఉపయోగించడానికి సేవ్ ఆప్షన్‌ను ఎంచుకుంటారని తెలిపారు.
‘ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. మరెవరూ యాక్సెస్ చేసుకోని చోట మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవడం మంచిది. మీ మొబైల్ ఫోన్, నోట్‌బుక్‌లో మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో పాస్‌వర్డ్స్‌లను భద్రపరిచేందుకు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ‘పాస్‌వర్డ్ మేనేజర్’ ను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి మీ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ఉపకరిస్తాయి.’ అని రోయర్ తెలిపారు.
సురక్షితమైన, స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ కోసం రోయర్ చెప్పిన మూడు చిట్కాలు:
1. ప్రత్యేకమైన, పొడవైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోవాలి. మీరు ఉపయోగించే ప్రతి సేవకు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడం మరింత సురక్షితం. పాస్‌వర్డ్ ఒకే ఫార్మాట్‌లో ఉండకుండా.. ఒక వాక్యం, కొన్ని ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు ఉపయోగించి పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోవాలి.
2. అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. అయితే, మరెవరూ ఉపయోగించని డివైజ్‌లలో మాత్రమే మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోండి. అలా చేయడం ద్వారా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం తక్కువ.
3. అనేక పాస్‌వర్డ్స్ ఉంటే గనుక ‘పాస్‌వర్డ్ మేనేజర్’ను ఉపయోగించడం మేలు అని రోయర్ చెబుతున్నారు. సంక్లిష్టమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి ఇది సురక్షితమైన మార్గం అని రోయర్ పేర్కొన్నారు. ప్లే స్టోర్‌లో చాలా ప్రోగ్రామ్‌లు, అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఇంకా ఐటీ వాళ్ల సలహాలు మీకు మరింత ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.