Trending

6/trending/recent

Digestion Problem Tips తిన్న ఆహారం జీర్ణం కావట్లేదా.. ఇలా చేయండి..

Digestion Problem Tips: కొంచెం హెవీగా తిన్నా, అసలేమీ తినకపోయినా పొట్టలో కొద్దిగా తేడాగా ఉంటుంది. పొట్టలోకి ఎవరో గాలి కొట్టినట్టుగా ఉంటుంది. ఈ బ్లోటింగ్ కి చాలా కారణాలుంటాయి. చాలా వరకూ కొంత సమయం గడిచిన తరువాత దానంతట అదే తగ్గిపోతుంది. కొంత మంది ఈ సమస్యని తరచూ ఫేస్ చేయవలసి రావచ్చు, అప్పుడు రెగ్యులర్ లైఫ్ కొంచెం డిస్ట్రబ్ అవుతుంది. ఇక్కడ అలాంటప్పుడు పాటించవలసిన కొన్ని హోమ్ రెమెడీలు ఉన్నాయి, చూడండి

ప్రధానాంశాలు:

  • కడుపులో సమస్యలు దూరం చేసే టిప్స్
  • జీర్ణ సమస్యలు దూరం చేసే ఇంట్లోని పదార్థాలు

కారణాలు:

బ్లోటింగ్ కి ఎన్నో కారణాలుంటాయి. అవి:
1. బీన్స్, బ్రకోలీ, కాలీ ఫ్లవర్, ఫిజ్జీ డ్రింక్స్ వంటివి తీసుకోవడం
2. సరిగ్గా అరగకపోవడం
3. మీ ఆహారపు అలవాట్లలో తేడా రావడం
4. కాన్స్టిపేషన్
5. ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉండడం
6. యాంటాసిడ్స్, యాస్పిరిన్, పెయిన్ కిల్లర్స్ వంటి కొన్ని మెడికేషన్స్
7. లాక్టోజ్ ఇంటాలరెన్స్
8. ఐరన్, మల్టీ విటమిన్ సప్లిమెంట్స్
9. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, గాస్ట్రైటిస్, క్యాసర్, పీఎంఎస్ వంటివి

లక్షణాలు:

1. గ్యాస్
2. పొట్ట గట్టిగా ఉండడం
3. కడుపు నొప్పి
4. తేన్పులు రావడం
5. పొట్ట లోంచి చప్పుళ్ళూ
6. వికారంగా అనిపించడం 
ఈ బ్లోటింగ్ తగ్గించుకోవడానికి ఏం చేయాలో చూడండి.

* పెప్పర్మింట్ టీ

1. ఒక టీ స్పూన్ ఎండిన పెప్పర్మింట్ ఆకులు లేదా, ఒక గుప్పెడు తాజా పెప్పర్మింట్ ఆకులని ఒక కప్పు వేడి నీటిలో వేసి మరిగించండి
2. స్టవ్ సిమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉంచి ఆ తరువాత వడకట్టండి.
3. రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకుని వెచ్చ వెచ్చగా తాగేయండి.
4. ఇలా రోజుకి మూడు సార్లు చేయవచ్చు.

* చామోమిల్ టీ

1. ఒక కప్పు వేడి నీటిలో ఒకటి రెండు టీ స్పూన్ల చామోమిల్ హెర్బ్ వేయండి.
2. ఐదు నుండి పది నిమిషాలు కప్పుకి మూత పెట్టి వదిలేయండి.
3. ఆ తరువాత వడకట్టి రుచికి కొద్దిగా తేనె కలుపుకుని వెచ్చగా తాగేయండి.
4. ఇలా రోజుకి రెండు మూడు సార్లు చేయవచ్చు.

* సోంపు గింజలు

1. ఒక టీ స్పున్న్ క్రష్ చేసిన సోంపు గింజలని ఒక కప్పు వేడి నీటిలో వేయండి.
2. ఐదు పది నిమిషాలు కప్పుకి మూత పెట్టి వదిలేయండి.
3. వడకట్టి, రుచికి తేనె కలుపుకుని తాగేయండి.
4. ఇలా రోజుకి ఒక సారి చేయవచ్చు.
5. లేదంటే, అర టీ స్పూన్ సోంపు గింజల్ని రోజూ నమలవచ్చు.

* బేకింగ్ సోడా

1. ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలపి తాగేయండి.
2. ఇలా రోజుకి ఒక సారి చేయవచ్చు. 

* అల్లం

1. ఒక కప్పు నీటిలో ఒక అంగుళం అల్లం తరుగు వేసి మరిగించండి.
2. నీరు మరిగిన తరువాత స్టవ్ సిమ్ లో పెట్టి మూడు నుండి ఐదు నిమిషాలు ఉంచండి.
3. వడకట్టి తాగేయండి.
4. కావాలనుకుంటే రుచికి తేనె కలుపుకోవచ్చు.
5. ఇలా రోజుకి మూడు సార్లు చేయవచ్చు. 

* గుమ్మడి పండు

1. ఒక కప్పు గుమ్మడి పండు మూకలు తీసుకోండి.
2. వీటిని రెండు కప్పుల నీటిలో ఉడికించండి.
3. వీటిని స్నాక్ లాగా తీసుకోండి.
4. లేదా ఇంకెలా అయినా కూడా గుమ్మడి పండుని మీ డైట్ లో చేర్చుకోండి.
5. ఇలా రోజుకి ఒక సారి చేయవచ్చు. 

* నిమ్మ రసం

1. ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకోండి.
2. అందులో ఒక టీ స్పూన్ తాజా నిమ్మ రసం కలుపుకోండి.
3. రుచికి తేనె కలుపుకుని తాగేయండి.
4. ఇలా రోజూ పొద్దున్నే పరగడుపున చేయండి. 

* కారవే సీడ్స్

1. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ కారవే సీడ్స్ వేయండి.
2. కప్పుకి మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాలు ఉంచేయండి.
3. వడకట్టి రుచికి తేనె కలుపుకుని తాగేయండి.
4. ఇలా రోజుకి మూడు సార్లు చేయవచ్చు.

* అరటి పండు

1. రోజుకి ఒకటి రెండి అరటి పండ్లు తినండి.
2. వీటిని స్నాక్ లాగా తీసుకోవచ్చు.

* యాపిల్ సైడర్ వెనిగర్

1. ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకోండి.
2. అందులో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగేయండి.
3. మీకు కావాలనుకుంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు.
4. ఇలా రోజుకి ఒకసారి చేయవచ్చు.

* ఆముదం

1. ఒక కప్పు ఏదైనా పండ్ల రసం తీసుకోండి.
2. అందులో ఒక టీ స్పూన్ ఆముదం కలపండి.
3. బాగా కలిపి వెంటనే తాగేయండి.
4. బ్లోటింగ్ అనిపించినప్పుడు ఇలా చేయవచ్చు.

* డీటాక్స్ డ్రింక్

1. ఒక కీరా, ఒక నిమ్మ కాయ, రెండు యాపిల్స్ తీసుకోండి.
2. వీటిని బ్లెండర్ లో వేసి జ్యూస్ తీయండి.
3. వెంటనే తాగేయండి.
4. ఇలా రోజుకి ఒక సారి చేయవచ్చు.

* పెప్పర్మింట్ ఎస్సెన్షియల్ ఆయిల్

1. రెండు టీ స్పూన్లు కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోండి.
2. ఇందులో మూడు నాలుగు చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలపండి.
3. ఈ మిశ్రమాన్ని పొట్ట మీద మృదువ్గా రబ్ చేయండి.
4. ఇలా రోజుకి ఒక సారి చేయవచ్చు.

* గ్రీన్ టీ

1. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి మరిగించండి.
2. మరిగిన తరువాత ఐదు నిమిషాలు స్టవ్ సిమ్ లో పెట్టి ఉంచండి.
3. వడకట్టి తాగేయండి.
4. మీకు కావాలనుకుంటే రుచికి తేనె కలుపుకోండి.
5. ఇలా రోజూ మూడు సార్లు చేయవచ్చు. 

* కొబ్బరి నూనె

1. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని డైరెక్ట్ గా తాగేయండి.
2. లేదా, సలాడ్స్, జ్యూసుల్లో యాడ్ చేసుకోండి.
3. ఇలా రోజుకి ఒకసారి చేయవచ్చు.

* పెరుగు

1. ఒక కప్పు పెరుగుని అలాగే తినేయవచ్చు.
2. లేదా మజ్జిగ చేసుకుని తాగవచ్చు.
3. ఇలా రోజుకి ఒకసారి చేయండి.

* పైనాపిల్ జ్యూస్

1. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకోండి.
2. ఒక కప్పు నీరు కలిపి బ్లెండ్ చేయండి.
3. ఈ జ్యూసుని రోజూ ఒక సారి తీసుకోవచ్చు.
4. పైనాపిల్ జ్యూస్ ని పరగడుపున తాగకండి.

* ఆరెంజ్ జ్యూస్

1. ఒకటి రెండు ఆరెంజెస్ తీసుకోండి.
2. ఒక కప్పు నీరు కలిపి బ్లెండ్ చేయండి.
3. భోజనానికి ముందు రోజూ ఒక సారి ఈ జ్యూస్ తాగండి. 

బ్లోటింగ్ తగ్గడానికి..

1. క్యాబేజ్, బీన్స్, సాఫ్ట్ డ్రింక్స్ తగ్గించండి.
2. ఏదైనా తింటున్నా, తింటున్నా గాలి లోపలికి వెళ్ళకుండా చూసుకోండి.
3. స్మోకింగ్ చేయకండి.
4. అల్కహాల్ తీసుకోకండి.
5. తగిన మోతాదులోనే ఆహారం తీసుకోండి.
6. కాన్స్టిపేషన్ సమస్య ఉంటే తక్షణం దానికి పరిష్కారం చూడండి.
7. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి.
8. ఓవరాల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెయిన్ చేయండి.

డాక్టర్ ని ఎప్పుడు..

గ్యాస్, బ్లోటింగ్ తో పాటూ ఈ క్రింది లక్షణాలు కనబడితే వెంటనే మీ డాక్టర్ ని కలవండి.

1. చాతీలో నొప్పి, లేదా చాతీ పట్టేసినట్లు ఉండడం
2. శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు
3. నీరసం
4. కళ్ళు తిరిగినట్లుగా ఉండడం
5. జ్వరం
6. రక్తపు వాంతులు
7. తట్టుకోలేనంత కడుపు నొప్పి
8. గుండె స్పీడ్ గా కొట్టుకోవడం
9. చర్మం, కళ్ళు పచ్చబడడం వంటి జాండీస్ లక్షణాలు

గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు. .

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad