Trending

6/trending/recent

Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన డబ్బులు పడేది అప్పుడే.. సీఎం జగన్ ఆదేశాలు

విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్ తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏ్రపిల్ 9న జగనన్న.. 

విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా దీవెనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్ తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏ్రపిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 27న వసతిదీవెన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సంర్భంగా ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నారు. దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్దిదారులు ఉన్నారు.

అసలే కరోనా కష్టాలు..ఆపై అరకొర జీతాలు..కరోనా నుంచి బయటపడని జీవితాలు. ఈ క్రమంలో పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. అయితే ఏపీలో సీఎం జగన్..జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద కుటుంబాలకు చేయూతగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.  నిధులు విడుదల చేసిన వారంలోపు పేరెంట్స్ కళాశాలలకు ఫీజు చెల్లిస్తారని..

జగనన్న విద్యాదీవెన స్కీమ్ కింద విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజులు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కళాశాలలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad