Trending

6/trending/recent

Android Apps: ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి... వెంటనే ఇలా చేయండి

Android Apps Crashing | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఇదే సమస్య. దీనిపై గూగుల్ పనిచేస్తోంది. మరి మీరేం చేయాలో తెలుసుకోండి.

1. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి అలర్ట్. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి. ముఖ్యంగా సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకే ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. యాప్స్ క్రాష్ అవుతున్నట్టు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు.

 2. సాంసంగ్ గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఏ50, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఏ71, నోట్ 20 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. వెబ్ కంటెంట్‌ను డిస్‌ప్లే చేయడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలో సమస్య ఉండటం కారణంగా యాప్స్ క్రాష్ అవుతున్నాయి.

 3. జీమెయిల్, గూగుల్ లాంటి గూగుల్ యాప్స్ మాత్రమే కాదు అమెజాన్ లాంటి ఇతర యాప్స్ కూడా క్రాష్ అవుతున్నట్టు యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. సాంసంగ్ మాత్రమే కాదు గూగుల్ పిక్సెల్, మోటోరోలా, హువావే లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇదే సమస్య ఉంది. కానీ ఎక్కువగా సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో యాప్స్ క్రాష్ అవుతున్నాయి.

4. యాప్స్ క్రాష్ అవడంపై గూగుల్ దృష్టి పెట్టింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. గూగుల్ అప్‌డేట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతలోపు యూజర్లు వెబ్‌వ్యూ అప్‌డేట్‌ను తొలగించి స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ చేస్తే చాలు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది.

5. ఇందుకోసం యూజర్లు ముందుగా తమ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత యాప్స్ ఓపెన్ చేయాలి. యాప్స్ లిస్ట్‌లో కిందకు స్క్రోల్ చేస్తే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ కనిపిస్తుంది.

6. ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ ఓపెన్ చేసిన తర్వాత Uninstall Updates పైన క్లిక్ చేయాలి. అంతే లేటెస్ట్ అప్‌డేట్ అన్‌ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను ఓసారి రీస్టార్ట్ చేయాలి.

7. ఇలా అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్స్ క్రాష్ కావు. గూగుల్ ఈ సమస్యను గుర్తించి అప్‌డేట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ యాప్ అప్‌డేట్ చేయొచ్చు.  



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad