Trending

6/trending/recent

AP: ఆ ఉన్నత ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్

సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP: ఆ ఉన్నత ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్

వైసీపీ ప్రభుత్వ హయంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖలను, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు.

ఇలాంటి వారిని తొలగించి దీనిపై 24వ తేదీ లోగా నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆయా శాఖల్లో తప్పనిసరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఇక పోలవరం, రాజధానిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఏ అంటే అమరావతి అని పీ అంటే పోలవరంగా ఆయన అభివర్ణించారు. గత ప్రభుత్వం ఈ రెండింటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని..ఇప్పుడు వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ వైసీపీ నాయకులను ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad