Trending

6/trending/recent

AP Teacher Transfers: అయ్యో బొత్స ఎంతపని చేశావ్, జగన్ కు కూడా తెలీదా ?, టీచర్ల దెబ్బకు ఫ్యాంట్లు ??

 ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలపై గత వైసీపీ ప్రభుత్వం ముందు ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఎన్నికల ముందు అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖలోని కొందరు అధికారులు ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని రాత్రికిరాత్రి బదిలీలు చేశారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో టీచర్ల బదిలీలకు బ్రేక్​పడింది. దీంతో ప్రభుత్వ టీచర్ల బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాపోతున్నారు. బదిలీల సిఫార్సు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచక, ఇచ్చిన డబ్బులు తిరిగిరావని ఆందోళనలో పడ్డారు. దీనిపై కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని ఉపాధ్యాయులు ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కోట్ల రూపాయలు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖలోని కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైఎస్సార్సీపీ మంత్రులు, అదే పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కిందిస్థాయి నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొన్న మంత్రి బోత్స సత్యనారాయణ, ఆయన పేషీలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలో పనిచేసే కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టీచర్ల బదిలీలు చేశారు.

వీటిపై అప్పట్లోనే చాలా మంది టీచర్లు ఆరోపణలు చేశారు. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారని ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్‌ అయి కొత్త పాఠశాలల్లో చేరాలని మొదట అధికారులు ఆదేశాలిచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో కోడ్‌ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్‌ గురువారంతో ముగిసిపోయింది.

ఇప్పుడు ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అప్పటి వైసీపీ ప్రబుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం డబ్బులు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది.

ఇందులో 14,500 మందికి మాత్రమే బదిలీలు చేశారు. వీరిలోనూ కొందరికి పోస్టులు లేకుండా పోయాయి. డబ్బులు ఇచ్చినా బదిలీలు కాని కొందరు ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో సమావేశం నిర్వహించి ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయిన మంత్రి బోత్స సత్యానారాయణ సైలెంట్ గా ఉండిపోయారని తెలిసింది అయితే విద్యాశాఖలో భారీగా డబ్బులు వసూలు చేసిన అధికారులకు ఫ్యాంట్లు తడిచిపోతా ఉన్నాయని సమాచారం.

రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ 3 లక్షల నుంచి రూ 6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారని తెలిసింది. వివిధ కారణాలతో వాళ్లు నివాసం ఉంటున్న పట్టణాలు, నగరాల సమీపంలోకి వచ్చేందుకు ఉపాధ్యాయులు ఈ బదిలీలను ఆశ్రయించారు. మంత్రి బోత్సా సత్యనారాయణ, ఆయన పేషీలోని పీఏ, కొందరు విద్యాశాఖ అధికారులు కలిసి దాదాపు రూ. 40 కోట్లకు పైగా బదిలీలు చేస్తామని ఉపాధ్యాయుల నుండి దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో ఇచ్చిన డబ్బులు కూడా తిరిగిరావని బాధిత టీచర్లు ఆందోళనకు దిగారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad