SSC Results: జూనియర్ ఇంజినీర్ ఫలితాలు విడుదల
జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)-2023 పేపర్-1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. OCT 9 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ అభ్యర్థులకు 30%, OBC/EWS అభ్యర్థులకు 25%, మిగతా కేటగిరీల వారికి 20% మార్కులను అర్హతగా నిర్ణయించారు. సివిల్ కేటగిరీలో 10వేల మంది అర్హత సాధించగా.. మిగతా విభాగాల్లో 2వేల మంది క్వాలిఫై అయ్యారు. డిసెంబర్ 4న పేపర్-2 పరీక్ష జరగనుంది