NTR 100 Rupees Coins: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 NTR 100 Rupees Coins: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

NTR 100 Rupees Coins: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు

NTR 100 Rupees Coins Created New Record in Sales: హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్టీఆర్ దిగా రికార్డులకు ఎక్కింది. ఇక రెండున్నర నెలల్లో 25, 000 నాణాలు అమ్ముడు పోవడంతో దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు అన్నారు. శనివారం ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి జనార్ధన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు విఎన్ఆర్ నాయుడు, శ్రీనివాస్ గండపనేడు, తానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది, మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని అన్నారు.

అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని , ఆ రికార్డు ను ఎన్టీఆర్ స్మారక నాణెం బ్రేక్ చేసిందని , ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని అన్నారు. ఇక కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని ఆయన అన్నారు. టిడి జనార్దన్ మాట్లాడుతూ , అన్న ఎన్టీఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు. అన్న గారి శతాబ్ది సంవత్సరంలో మా కమిటీ ఎన్టీఆర్ శాసన సభ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రిక ప్రసంగాలు , శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించామని అన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు . దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చెయ్యగా ,అందులో అన్నగారి స్మారక నాణెం ప్రథమ శ్రేణిలో ఉండటం మాకు గర్వకారణం , ఇది గిన్నెస్ రికార్డు సృష్టించాలని మేము కోరుకుంటున్నామని జనార్దన్ చెప్పారు.

Below Post Ad


Post a Comment

0 Comments