Chandrababu Case: మద్యం, ఇసుక పాలసీ.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

స్కిల్ డెవలప్‌‍మెంట్ కేసులో బెయిల్ దొరకడంతో.. చంద్రబాబుకు కాస్త ఊరట దక్కినట్టైంది. అయితే లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వాటిపై ఇరు వర్గాలు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఆ కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Chandrababu Case: మద్యం, ఇసుక పాలసీ.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

స్కిల్ డెవలప్‌‍మెంట్ కేసులో బెయిల్ దొరకడంతో.. చంద్రబాబుకు కాస్త ఊరట దక్కినట్టైంది. అయితే లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వాటిపై ఇరు వర్గాలు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఆ కేసుల్లో ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్‌‍పై.. ఇరు వర్గాలు వాదనలు వినిపించారు. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్క పిటిషన్‌పైనా తీర్పు రాలేదు.

మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం చంద్రబాబు తరుపు లాయర్ల వాదనలు పూర్తవ్వగా.. బుధవారం సీఐడీ తన వాదనలు వినిపించింది. ఇది కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఇందులో చంద్రబాబు తప్పు లేదు. లిక్కర్ పాలసీలో అప్పట్లో కొంతమంది ఇచ్చిన ప్రివిలేజెస్‌ను కేబినెట్ ఆమోదించిందని చంద్రబాబు లాయర్లు వాదించారు. అసెంబ్లీలో ఆమోదం కూడా పొందిందనీ.. ఇందులో అక్రమాలు జరిగినట్టు సీఐడీ చేసిన అభియోగాలపై ఏలాంటి ఆధారాలు లేవనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో వరుస కేసులు నమోదు చేస్తున్నారని వాదించారు. 25 షాపులకు ఇచ్చిన ప్రత్యేక అనుమతుల్లో చంద్రబాబుకు ఏలాంటి సంబంధం లేదని, 17A అమెండమెంట్ యాక్ట్ ఈ కేసుకు కూడా వర్తిస్తుందని వాదించారు చంద్రబాబు తరుపు న్యాయవాది నాగ ముత్తు.

అయితే, బెయిల్ విషయంలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లకూడదని, చంద్రబాబు పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ, అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లారని, దాని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందని తన వాదనలు వినిపించారు. కొంతమందికే లాభం జరిగేలా ఎక్సైజ్ పాలసీని మార్చారని వాదించారు. 2015 – 2017 లిక్కర్ పాలసీ జీవోలను సీఐడీ లాయర్ చదివి వినిపించారు. ఆ కాపీలు తమకు ఇవ్వలేదంటూ బాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తంచేయడంతో, వాదనలు అక్కడితో ఆగిపోయాయి. ఈలోపే కోర్టు సమయం అయిపోవటంతో తదుపరి విచారణ గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా పడింది.

ఇక, ఉచిత ఇసుక స్కీమ్‌లోనూ అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ2గా చంద్రబాబు ఉన్నారు. దీనిపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ అగ్రవాల్ వాదనలు వినిపించారు. 2016లో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ద్వారా ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదని, ఇళ్లు కట్టుకునే వారికి వారి అవసరం ప్రాతిపదికన ఇసుక సరఫరా జరిగిందన్నారు. 2019లో ప్రభుత్వం మారాక 5 నెలల వరకూ ఇదే విధానాన్ని కొనసాగించారని, ఇసుక విధానంలో లోపం ఉంటే 2023 అక్టోబర్ వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక అక్రమాలపై బీజేపీ చేసిన ఆరోపణలను దృష్టి మరల్చేందుకు ఈ కేసు పెట్టారని వాదించారు. రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. దీనిపై తదుపరి విచారణ శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.

Below Post Ad


Tags

Post a Comment

0 Comments