Trending

6/trending/recent

OSC Dropout Children: బడి బయట పిల్లల లెక్కల్లో మాయ

  • చదువు మధ్యలో ఆపేసినవారు స్కూల్లోనే ఉన్నట్టు చూపాలనిప్రైవేటు పాఠశాలలపై ఒత్తిడి
  • టీసీలు ఎక్కువ ఇవ్వొద్దంటూ ప్రభుత్వ హెచ్ఎంలకు ఆదేశాలు
  • గతంలో చదువు మానేసిన వారి పేర్లూ నమోదు చేయాలంటూ హెచ్చరికలు

అమరావతి: పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.

OSC Dropout Children: బడి బయట పిల్లల లెక్కల్లో మాయ

జూన్‌ 28న అమ్మఒడి పథకం నిధుల విడుదల సమావేశంలో సీఎం జగన్‌

రాష్ట్రవ్యాప్తంగా చదువు మధ్యలో మానేసినవారు 1,73,416 మంది ఉన్నారు. వీరిలో 1-5 తరగతుల్లో మానేసినవారు 66,205 మంది ఉండగా.. ఉన్నత పాఠశాలల స్థాయిలో 1,07,211 మంది ఉన్నారు. వీరిని గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలి.

గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు గతేడాది అక్టోబరులో పాఠశాల విద్యాశాఖ లేఖ

మీ పాఠశాలలో చదువు మానేసిన పిల్లల వివరాలు డ్రాప్‌బాక్సులో కనిపిస్తున్నాయి. వాటిని వెంటనే వెనక్కి తీసుకోండి. మీ వద్దే చదువుతున్నట్టు పేర్లను రిజిస్టర్లలో రాసుకోండి.

ప్రైవేటు యాజమాన్యాలు, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారుల ఆదేశాలు

బడి మానేసిన పిల్లల సంఖ్య తగ్గించి చూపేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. చదువు మధ్యలో ఆపేసినవారు మళ్లీ బడుల్లో చేరినట్లు లెక్క చూపేందుకు అక్రమ మార్గాలు అనుసరిస్తోంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై క్షేత్రస్థాయి విద్యాధికారులు ఒత్తిడి తీసుకొచ్చి డ్రాపౌట్‌ విద్యార్థులూ బడిలోనే చదువుతున్నట్లు లెక్కలు రాయాలని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి తమపై ఒత్తిడి ఉందని, చదువు మానేసిన వారిని ఏదోలా పాఠశాలలో సర్దుబాటు చేసుకోవాలని ఆదేశిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థి బడి మానేస్తే.. అందుకుగల కారణం రాస్తూ డ్రాప్‌బాక్సులో సమాచారాన్ని ఉంచాలి. వీరు రాష్ట్రంలో ఎక్కడైనా మరో బడిలో చేరినట్లయితే దాన్నుంచి తీసేయాలి. డ్రాప్‌బాక్సులో పేర్లు ఉన్నవారు బడి బయట ఉన్నట్లే లెక్క. ఈ సంఖ్యను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గతేడాది నలుగురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లారు. మరో ఆరుగురు తెలంగాణకు వెళ్లారు. ఈ ఒక్క బడిలోనే 27 మంది వివరాలు డ్రాప్‌బాక్సులో చేరాయి. వీరందరూ మళ్లీ ఈ బడిలోనే చేరినట్లు రాసుకోవాలని విద్యాధికారులు యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నారు. గతేడాది ఇలాగే ప్రైవేటు యాజమాన్యాలు కొందరికి కొన్ని నెలలపాటు హాజరు వేశాయి. ఇప్పుడు మళ్లీ డ్రాప్‌బాక్సుల్లో పెట్టేశాయి. మళ్లీ వాటి నుంచి తొలగించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వ బడుల్లో డ్రాప్‌బాక్సులో ఉన్నవారు ఏదో ఒక పాఠశాలలో చేరే వరకు ఉపాధ్యాయులదే బాధ్యతని ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు ఆదేశిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి చదివిన వారందరినీ డ్రాప్‌బాక్సులో పెట్టారు. ఇప్పుడు వీరందరూ ఎక్కడో చోట చేరేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. తమ బడి నుంచి వెళ్లిపోయాక ఎక్కడ చేరతారో తమకెలా తెలుస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఆ సంఖ్యను తగ్గించుకునేందుకు..

గతేడాది 2.25 లక్షలమంది బడి మానేయగా 52 వేల మందిని తిరిగి చేర్పించినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 1.73 లక్షల మందిని గుర్తించే బాధ్యతను సచివాలయాలకు అప్పగించింది. ఇతర రాష్ట్రాలకు తల్లిదండ్రులతోపాటు 16,857 మంది పిల్లలు వలస వెళ్లారు. సీజనల్‌ వలస వల్ల 38,951 మంది బడి మానేశారు. వివిధ కారణాలతో 1,289 మంది చనిపోయినట్లు లెక్కలు చూపారు. వేరే ప్రాంతాలకు వెళ్లారని, కొందరు దూరవిద్యలో చేరారని, ఇంకొందరు అనారోగ్యంతో మానేశారంటూ కొంత తగ్గించేశారు.

2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి గత అక్టోబరులో 40,31,239 మంది ప్రభుత్వ బడుల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది విద్యా కానుక కోసం ఫిబ్రవరి, మార్చి లెక్కలు తీయగా 39,95,992గా ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే 35,247 మంది బడి మానేశారా? అధికారులే పిల్లల సంఖ్యను పెంచి చూపించేందుకు మొదట్లోనే ఎక్కువ మంది ఉన్నట్టు లెక్కలు చూపారా? అనే అనుమానాలున్నాయి.

టీసీలు ఇవ్వకుండా ఒత్తిడి

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసరికి టీసీలు ఇవ్వకుండా ప్రధానోపాధ్యాయులపై క్షేత్రస్థాయి అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వేరే బడులకు వెళ్లిపోతామని విద్యార్థులు వస్తే టీసీలు ఇవ్వకుండా సర్దిచెప్పేందుకు ప్రధానోపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ టీసీలు ఇస్తే వారిని ఉన్నతాధికారులు వివరణ కోరుతున్నారు. పిల్లలు బడి మానేసినట్లు డ్రాప్‌బాక్సులో నమోదు చేస్తే సత్వరం పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇలాంటిచోట్ల 1, 2 తరగతులే మిగలడంతో రెండేళ్లే చదివే అవకాశమున్నందున కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడం లేదు. సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad