జిల్లా విద్యాశాఖ అధికారులకు అందరికీ నమస్కారం ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి సందేశాన్ని ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి వీక్షించగలరు కావున ఈ లింక్ ని దయచేసి మీ జిల్లా పరిధిలోని అందరూ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది వీక్షించేలాగా అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అందరూ వీక్షించేలాగా మీరు మండల విద్యాశాఖ అధికారులకు హెడ్మాస్టర్లకి మరియు ఉపాధ్యాయులకు ఈ లింకుని ఖచ్చితంగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.
ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 8 వ ఎపిసోడ్ ముఖ్య విషయాలు
నేను పాఠశాలలకు విజిటింగ్ కు వచ్చేటప్పుడు ఇకనుండి నా సొంత నిర్ణయంతో రాను!
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పట్టిక రూపంలో కంప్యూటర్లో ఉంచి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి, ఏ పాఠశాల పేరు display అయితే ఆ పాఠశాలలకు విజిటింగ్ కు రావడం జరుగుతుంది.
పాఠశాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బెస్ట్ యూజ్ చేయాలి.వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథాగా వాడకుండా ఉంచరాదు.
విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యా నాణ్యత విషయంలో కాంప్రొమైజ్ కారాదు. నా సందర్శనలలో ఫోకస్ ఐటెం ఇదే.
FA 1 పరీక్షలను విద్యార్దులు ఇంగ్లీష్ మీడియం లో రాసేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.FA 1 పరీక్షల్లో TOEFL పార్ట్ విషయం లో కూడా విద్యార్థులను సంసిద్ధులను చేయాలి.
ఎపిసోడ్ 8 వీడియో ద్వారా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి
ఈ రోజు (జులై 25) మధ్యాహ్నం 3.00 గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) "From the Desk of Principal Secretary School Education" Programme (8th Episode) కు సంబంధించి గౌ|| ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు, క్రింది YouTube Live చూడవచ్చును.