CBA Instructions TOEFL Overview

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

CBA Instructions TOEFL Overview

ఉపాధ్యాయులకు సూచనలు

పరీక్షలు నిర్వహించడానికి ముందుగా పాటించవలసిన సాధారణ సూచనలు:

పరీక్ష నిర్వహించే ముందు ఈ క్రింది సూచనలను సరిగ్గా చదవండి.)

1. ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య తగినంత దూరంతో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చున్నట్లు నిర్ధారించుకోండి.

2. విద్యార్థులు తమ పెన్నులు/పెన్సిళ్లను బయటకు తీసి సిద్ధంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.

3. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేయండి. 

4. ప్రశ్నాపత్రాలలో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి.

i)బహుళైచ్చిక ప్రశ్నలు (MCQ) - బహుళైచ్చిక ప్రశ్నలకి 3 నుండి 4 ఎంపికలు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమౌతుంది...

ii) ఎంపికలు లేని ప్రశ్నలు (FR: Free Response) ఈ ప్రశ్నలకి ఎంపికలు ఉండవు. ఇటువంటి ప్రశ్నలకు మార్కులకు అనుగుణంగా సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.

5. CB -1 ప్రశ్నల సంఖ్య మరియు మార్కుల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

6. అన్ని పేపర్లకు పరీక్షా సమయం 1 గంట మాత్రమే.

7. ప్రశ్నల సంఖ్య గురించి విద్యార్థులకు ముందుగా తెలియజేయండి. ప్రశ్నాపత్రంలో ఈ సమాచారం, పైన లేబుల్ లో ఇవ్వబడుతుంది.

8. సబ్జెక్టు వివరాలు, పరీక్ష ప్రారంభ సమయం మరియు ముగింపు సమయం బ్లాక్ బోర్డ్ పై వ్రాయబడ్డాయని నిర్ధారించుకోండి.

9. ప్రతి పరీక్ష ముందు విద్యార్థికి OMR అందచేయవలసి ఉంటుంది. OMR పై ఇవ్వబడిన విద్యార్థి యొక్క అన్ని వివరాలు (విద్యార్థి ID,విద్యార్థి పేరు, UDISE కోడ్ మరియు తరగతి) సరిచూసుకొనవలెను.

10.1 వ తరగతి నుండి 5 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీటి 4 సబ్జెక్టులు (తెలుగు, ఇంగ్లీషు, గణితం, EVS) కలిగి ఉంటుంది. 

11.1వ, 2వ తరగతులకు EVS పరీక్ష లేనందున వారి OMR లలో EVS నకు కేటాయించబడిన భాగంలో ఎటువంటి సమాధానాలు గుర్తించకుండా జాగ్రత్త వహించండి.

12. 6 వ తరగతి నుండి 8 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీట్ 6 సబ్జెక్టులు (ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం కలిగి ఉంటుంది. 

13. 3 నుండి 9 తరగతుల వరకు ఇంగ్లీషు సబ్జెక్ట్ లో part - B విభాగం క్రింద TOEFL టెస్ట్ నిర్వహించబడును. కావున 3 నుండి 8తరగతుల విద్యార్థుల చేత ఇంగ్లీషు part B భాగంలో సంబంధిత సమాధానాలు గుర్తించునట్లుగా సరిచూసుకోవలెను. TOFEL సూచనలు విడిగా జత చేయబడ్డాయి.

14. సరైన OMR లేకపోయినా లేదా OMR లభించక పోయినా, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న బఫర్ OMRని విద్యార్థికి అందజేయాలి. OMR షీటులో విద్యార్థుల వివరాలన్నీ మాన్యువల్ గా నమోదు చేయాలి.

15. విద్యార్థులు సమాధానాలను సంబంధిత సబ్జెక్టులకు కేటాయించిన భాగంలోనే గుర్తించేట్లుగా ఇన్విజిలేటర్లు జాగ్రత్త తీసుకొనవలెను.

Download Instructions PDF

Below Post Ad


Tags

Post a Comment

0 Comments