We Love Reading Summer Campaign - Program Detailed information in Telugu

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

We Love Reading Summer Campaign - Program Detailed information in Telugu వీ లవ్ రీడింగ్ సమ్మర్ క్యాంపెయిన్

విద్యార్థులను నాన్ రీడర్స్ నుంచి ఫ్లూయెంట్ రీడర్స్ గా తయారు చేయడమే "వీ లవ్ రీడింగ్ కార్యక్రమం" యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

We Love Reading Summer Campaign - Program Detailed information in Telugu

సి ఎస్ ఈ, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం రానున్న వేసవి సెలవులలో అనగా 01-05- 2023 నుంచి 10- 6- 2023 వరకు వి లవ్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేసి వారు ఆ పుస్తకాలను చదివేలా ప్రోత్సహించాలి. మరియు క్రింద తెలిపిన కార్యక్రమాలను విద్యార్థులచే నిర్వహింప చేయాలి. అలాగే తరగతుల వారి నిర్ధారించిన వీ లవ్ రీడింగ్ పోటీలలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలి.

ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు, చాత్రోపాధ్యాయులు కూడా వారికి కేటాయించిన పోటీలో పాల్గొనవచ్చు.

సమ్మర్ వెకేషన్ 2023లో నిర్వహించే వీలవ్ రీడింగ్ కార్యక్రమానికి గైడ్లైన్స్

  • మండల విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు వారి వారి పరిధిలో అధికారులు ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఈ వేసవి సెలవులలో నిర్వహించవలసిన "వి లవ్ రీడింగ్" కార్యక్రమము మరియు "వీలవ్ రీడింగ్ పోటీలు" గురించి వివరించాలి.
  • మండల విద్యాశాఖ అధికారులు వారి వారి మండలాలలో వినూత్న వ్యూహాలను రచించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుపరచాలి.
  • ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో ఉపాధ్యాయులను సమావేశపరచి స్పష్టమైన పాఠశాల యాక్షన్ ప్లాన్ ను తయారు చేసుకోవాలి.
  • పాఠశాలలోని విద్యార్థులను టీచర్లకు దత్తత ఇవ్వాలి.
  • ప్రతి ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన విద్యార్థులతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేయాలి.
  • లైబ్రరీ పుస్తకాలను తరగతుల వారిగా విభజించి లైబ్రరీ నందు ప్రదర్శించాలి.
  • ఒక్కో విద్యార్థికి ఐదు నుండి పది పుస్తకాలను( వారి వారి పఠన సామర్ధ్యానుసారం) ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ నందు నమోదు చేయాలి.
  • విద్యార్థులను వారి తల్లిదండ్రులకు కథలను బిగ్గరగా చదివి వినిపించమని ప్రోత్సహించాలి.
  • లీడ్ టీచర్ వాట్సప్ గ్రూపులో ప్రతిరోజు ఒక కథను పోస్ట్ చేసి విద్యార్థులను చదవమని చెప్పి తర్వాత ఆ కథ గురించి వారి అభిప్రాయాలను ఆ గ్రూపులో పోస్ట్ చేయమని చెప్పాలి.
  •  విద్యార్థులు సొంతంగా ఏవైనా కథలు రాస్తే వాటిని కూడా గ్రూపులో పోస్ట్ చేయమని చెప్పాలి.
  • పుస్తకాలు చదివిన తర్వాత చదివిన పుస్తకాలను వారి తరగతి తోటి విద్యార్థులతో ఉన్న పుస్తకాలతో ఎక్స్చేంజ్ చేసుకోమని తెలియజేయాలి.
  • అలాగే తమ దగ్గరలో ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించి, పుస్తకాలను ఇంటికి తెచ్చుకొని, చదవమని విద్యార్థులను ప్రోత్సహించాలి.

విద్యార్థులు నిర్వహించవలసిన కార్యక్రమాలు

  • మి అండ్ మై బుక్:- పుస్తకం చదివిన తర్వాత ప్రతి విద్యార్థి ఆ పుస్తకంపై తన అభిప్రాయాన్ని నోటు పుస్తకంలో రికార్డు చేయాలి. కథలోని పాత్రలు సన్నివేశాలు బొమ్మలపై వారి భావాలను తెలియజేయాలి.
  •  బుక్స్ ఇన్ ద సెల్ఫ్:- విద్యార్థులు తమ బంధువులు స్నేహితుల ఇళ్లకు వెళ్లి వారితో ఉన్న పుస్తకాల జాబితా తయారుచేసి ఆ జాబితాలోని పుస్తకాల ప్రాముఖ్యతను నోటు పుస్తకంలో వ్రాయాలి.
  •  పిక్చర్ గ్యాలరీ:- పాత వార్తాపత్రికలు మేగజైన్లను సేకరించి, అందులో ఆసక్తికరమైన పిక్చర్లను కత్తిరించి, వాటిని పుస్తకంలో అతికించాలి.
  •  ద స్టోరీస్ ఆఫ్ మై ఫ్రెండ్స్:- విద్యార్థులు సమస్యలతో ఒక గ్రూపుగా ఏర్పడి వారు చదివిన కథల గురించి చర్చించి ఆ కథలను వారి సొంత వాక్యాలలో ఒక పుస్తకంలో వ్రాయాలి.
  •  మై స్టోరీ బుక్:- పాత వార్తాపత్రికలు నుండి కథలు సేకరించి నోటు పుస్తకంలో అతికించాలి.
  •  పిక్చర్ స్టోరీ:- వార్తాపత్రికలు మేగజైన్ల నుంచి ఏవైనా పిక్చర్లను సేకరించి, వాటిని ఆధారంగా చేసుకుని కథను రచించాలి.
  •  మై బుక్:- విద్యార్థి తన సొంతంగా రాసిన కథలతో, బొమ్మలతో ఒక పుస్తకాన్ని తయారు చేయాలి.

విద్యార్థులకు నిర్వహించే పోటీలు

లెవెల్ 1:- మూడు నుండి ఐదు తరగతుల విద్యార్థులు అర్హులు

1.స్టోరీ రీడింగ్ కాంపిటీషన్ : ఈ స్థాయి విద్యార్థి ఏదైనా ఒక కథను ఎంచుకొని, ఆ కథను బిగ్గరగా చదువుతూ మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, ఆ ఆడియో క్లిప్పింగ్ ను క్రింది మెయిల్ కు పంపాలి.

Mail id: WELSTORYREADING2023@GMAIL.COM

 లెవెల్ 2:-  6 నుండి 8 తరగతుల విద్యార్థులు

 1.స్టోరీ రీడింగ్ కాంపిటీషన్ : లెవెల్ వన్ లో చెప్పిన విధంగా ఆడియో రికార్డు చేసి మెయిల్ చేయాలి.

 2.స్టోరీ రైటింగ్ కాంపిటీషన్:ఈ స్థాయి విద్యార్థి తన సొంతంగా ఒక కథను తయారుచేసి, దానిని స్కాన్ చేసి గాని, సాఫ్ట్ కాపీను గాని క్రింది మెయిల్ కు పంపాలి.

Mail id: WELSTORYWRITING3023@GMAIL.COM

 లెవెల్ 3:-9 నుంచి 12 తరగతుల విద్యార్థులు మరియు డి ఐ ఈడి విద్యార్థులు

1.స్టోరీ రైటింగ్ కాంపిటీషన్ : లెవెల్ టూ లో సూచించిన విధంగా విద్యార్థులు స్టోరీ రైటింగ్ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు.

2.రివ్యూ రైటింగ్ కాంపిటీషన్ : ఇందులో విద్యార్థులు ఒక పుస్తకం లేదా కథపై సమీక్ష వ్రాసి దానిని క్రింది మెయిల్ అడ్రస్ కు  కు పంపాలి.

Mail id: WELSTORYWRITING2023@GMAIL.COM

 3.మై పర్సనల్ లైబ్రరీ- సెల్ఫీ కాంపిటీషన్:- ఈ కాంపిటీషన్ కు 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

విద్యార్థులు వారి ఇంటిలో ఉన్న పుస్తకాల జాబితా తయారుచేసి, ఆ పుస్తకాలతో సెల్ఫీ దిగి, క్రింది మెయిల్ ఐడి లో అప్లోడ్ చేయాలి.

Mail id: WELSELFEE2023@GMAIL.COM

 డ్రాయింగ్ కాంపిటీషన్:- 3 వ తరగతి నుంచి 12 వ తరగతుల విద్యార్థులు అర్హులు.

A4 సైజ్ చార్టులో డ్రాయింగ్ వేసి క్రింది మెయిల్ అడ్రస్ కు పంపాలి.

Mail id: WELDRAWING2023@GMAIL.COM

ఉపాధ్యాయులకు టీచర్ ఎడ్యుకేటర్లకు పోటీలు

అన్ని  పాఠశాలల ఉపాధ్యాయులు, టీచరు ఎడ్యుకేటర్లు ఈ పోటీలకు అర్హులు.

క్లాసిక్ లిటరేచర్ కు సంబంధించిన ఏదైనా ఒక పుస్తకం ఎంచుకొని ఆ పుస్తకం పై రివ్యూ రాసి, క్రింది మెయిల్ ఐడి కు పంపాలి.

Mail id: WLRTEACHERS2023@GMAIL.COM

జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలి. పైన తెలిపిన కార్యక్రమాలన్నీ  వేసవి సెలవుల్లో అమలు పరచాలి.

పై కార్యక్రమానికి సంబంధించి మీ పాఠశాల నిర్వహించిన కార్యక్రమాలు మరియు పాల్గొన్న పోటీల వివరాలతో ఒక డాక్యుమెంటేషన్( ఫోటోలతో) తయారుచేసి సమగ్ర శిక్ష కార్యాలయం నందు అందజేయాలి.

Below Post Ad


Post a Comment

0 Comments