ఇదేనా రెస్పాన్సిబిలిటీ ? అధికారులపై, ఉపాధ్యాయుల పై విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • వర్క్ బుక్స్ ఉపయోగించరేమీ?
  • పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
  • బొబ్బిలి గురుకుల పాఠశాల ఆకస్మిక సందర్శన

Filephoto

విజిటింగ్ వీడియో

'పాఠశాలల్లో గోడలు, బల్లలు చూపించడం కాదు. విద్యా ప్రమాణాలు పెంచాలి. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వర్క్‌ బుక్స్‌తో పాటు నోటు పుస్తకాలు అందిస్తే వినియోగించరా?ఉపాధ్యాయుల్లో రెస్పాన్స్‌బిలిటీ, అకౌంట్‌బులిటీ లేవు'..అంటూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. నేరుగా ఆరో తరగతి గదిలో ప్రవేశించారు. పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్‌బుక్స్‌, నోట్‌ బుక్స్‌ అందరి వద్ద ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. బయటకు తీసి సిద్ధంగా ఉంచాలని విద్యార్ధులకు సూచించారు. కొంతమంది విద్యార్థులు పుస్తకాలను పరిశీలించగా..వాటిలో ఎటువంటి రాతలు కనిపించలేదు. దీంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల సొసైటీ కార్యదర్శి నరసింహారావును, ప్రిన్సిపాల్‌ రఘునాథ్‌తో పాటు ఉపాధ్యాయుల తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలను ఇంతవరకూ తనిఖీ చేశారంటూ సొసైటీ కార్యదర్శిని ప్రశ్నించారు. 110 పాఠశాలలని ఆయన చెప్పగా, మరెందుకు ఇలా ఉన్నాయని నిలదీశారు. పనిచేయని వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అటు విద్యార్థులను మరో గదిలోకి పంపించారు. మీడియాను సైతం బయలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బందితో సమావేశమై గట్టిగానే హెచ్చరికలు జారీచేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి వస్తానని.. రికార్డులను సక్రమంగా ఉంచాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుసరుసలాడుతూ కారెక్కి కేజీబీవీకి వెళ్లిపోయాయి. ఆయన వెంట డీఈవో లింగేశ్వరరెడ్డి, డిప్యూటీ డీఈవో నాయుడు ఉన్నారు.

Below Post Ad


Post a Comment

0 Comments