వైసీపీ రూలింగ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి ఫైర్ అయ్యారు.
Andhra Pradesh: దౌర్జన్యాలు చేస్తే తీవ్ర ఉద్యమాలే వస్తాయి.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
అధికార దాహంతో పరిపించే వైసీపీ నాయకులంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలమన్న పవన్.. అతడి లక్షణాలు గ్రామ స్థాయి కార్యకర్తల వరకు చేరితే ఎలా చూస్తూ ఊరుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) నేతలు అవినీతికి పాల్పడుతున్నారని.. వీటిని ఇప్పుడు అడ్డుకోలేకపోతే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకోరల్లోంచి భూమిని అసలైన యజమానులకు అందించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలే వస్తాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దౌర్జన్యాలను ఆపకపోతే ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయి. ప్రజలు ఇచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నాం. రాష్ట్రంలో పై స్థాయిలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారో కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే పని చేస్తున్నారు. అధికార దాహంతో పరితపిస్తుంటారు కాబట్టే వైసీపీ నేతలంటే నాకు చిరాకు. నాయకుడి లక్షణాలు గ్రామ స్థాయి నేతల వరకు చేరితే ఎలా భరించగలం. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు.
– పవన్ కల్యాణ్, జనసేన అధినేత