Trending

6/trending/recent

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు - 1998 DSC చరిత్ర

Updating Article...You can visit again for more updated information on this topic

1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. ఆ సమయంలో అభ్యర్థుల కటాఫ్ మార్కులకు సంబంధించి.. ఓసీలకు 50, బీసీలకు 45; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. ఆ మేరకు అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు కూడా పిలిచారు. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 221 జీవోను జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ ఉన్న అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం మరో జీవో 618 విడుదల చేసింది. District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఆయా జిల్లాల్లో తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రభుత్వం ఇలా రెండు జీవోలు జారీచేయడంతో.. మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత.. 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది.

కాని అధికారుల పొరపాటుతో ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండురకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు. దీంతో 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు లభించలేదు. దీంతో వీరంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

పలు దఫాలుగా అభ్యర్థుల వాదనలు విన్న ట్రైబ్యునల్ వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని 2009లో ఆదేశాలు జారీచేసింది. 2011లో హైకోర్టు కూడా త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే డీఎస్సీ నియామకాలకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అమలుకాకపోవడంతో అభ్యర్థులు చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ-1998 మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది

ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం తో 1998 DSC క్వాలిఫైడ్ అభర్ధులకు మోక్షం కలుగబోతుంది

డిఎస్‌సి-1998 అభ్యర్థులకు పోస్టింగు - ఫైల్‌పై సిఎం సంతకం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి-1998లో నష్టపోయిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోస్టింగు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సంతకం చేశారు. డిఎస్‌సి-1998లో అర్హతలు మార్చడం వల్ల 4,675 మంది అభ్యర్థులు నష్టపోయారు. తమకు న్యాయం చేయాలని వారు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు.

పాఠశాలలు తెరిచే లోపు పోస్టింగు ఇవ్వాలి : పిడిఎఫ్‌

పాఠశాలలు తెరిచేలోపు అభ్యర్థులకు పోస్టింగు ఇవ్వాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కోరారు. నియామక ఫైల్‌పై సిఎం సంతకం చేయడం పట్ల ఎమ్మెల్సీలు వి బాలసుబ్రమణ్యం, కెఎస్‌ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, 20 వేలకుపైగా ఎస్‌జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే 9 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య 6 లక్షలకుపైగా పెరిగిందని పేర్కొన్నారు. 2008 డిఎస్‌సి అభ్యర్థులకుఇచ్చిన పద్ధతినే ఈ నియామకాలలో కూడా పాటించాలని కోరారు.

District Wise DSC-1998 Lists : జిల్లాల వారీగా డి.ఏస్.సి-1998 లిస్ట్ లు

Note: పై సమాచారం కేవలం వాట్సప్ మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతున్న  వివరాలు మాత్రమే. పూర్తి సమాచారం కోసం CSE వారి అఫిషియల్ వెబ్సైట్ ను వీక్షించ గలరు

Post a Comment

5 Comments
  1. Please upload Anantapur District results also

    ReplyDelete
  2. What about Visakhapatnam district 1998 DSC list

    ReplyDelete
  3. There i s no information about vizag dt.candidates,please upload it

    ReplyDelete

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad