TIS Enabled for All 13 Districts with new environments : 13 జిల్లాలకు పనిచేస్తున్న కొత్త టి.ఐ.ఎస్
TIS Enabled for All 13 Districts with new environments
న్యూస్ టోన్, అమరావతి : టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను కొత్త సర్వర్ లకు విద్యాశాఖ మార్పు చేసింది. సర్వర్ పై పడే భారానికి తగిన విధంగా కొత్త సాంకేతికతను ఏర్పాటు చేసింది. పాత సర్వర్ సరిగా పని చేయక పోవడం, వెబ్సైట్ లో సాంకేతిక లోపాలు ఉండడం వల్ల ఉపాధ్యాయులు డేటా ఎంట్రీ కి చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన సర్వర్ లతో ఈ ఇబ్బంది అధిగమించినట్టే అని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ డేటా గతంలో ఇచ్చినదే అయినప్పటికీ పదే పదే మళ్ళీ ఎంటర్ చేయమని అడగటం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంటర్ చేసిన డేటా మొత్తం పోవడానికి బాధ్యులని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
టీ. ఐ. ఎస్ న్యూ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి