Aided Teachers Absorption Web Counseling Schedule Released : ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
Aided Teachers Absorption Web Counseling Schedule Released
న్యూస్ టోన్, అమరావతి : గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయుల కల త్వరలో నెరవేరబోతోంది. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో కలుపుకునే దిశగా ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ ప్రక్రియలో చివరిదశ అయినటువంటి వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 15వ తేదీన ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మారబోతున్నారు. సీనియార్టీ కి సంబంధించిన వివిధ అంశాలు ఇప్పటికే పూర్తయి ఉన్నందున స్వల్పకాలిక షెడ్యూల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
Aided Teachers Absorption Web Counseling Schedule
ఎయిడెడ్ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ క్రింద పేర్కొన్న విధంగా నిర్వహించబడుతుంది.
- ఈనెల 8వ తేదీన సీనియారిటీ లిస్టు లను ప్రకటిస్తారు.
- 9 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎయిడెడ్ ఉపాధ్యాయులు తాము వెళ్లాలనుకునే పాఠశాలకు సంబంధించిన ఆప్షన్స్ ను వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది.
- ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 15వ తేదీన వారికి ఎలాట్ అయిన పాఠశాలలను ప్రకటిస్తారు.
- ఈ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సహకారం ఏ.పి.సి.ఎఫ్ ఎస్.ఎస్ (APCFSS) నుండి విద్యాశాఖ తీసుకోనుంది.