PRC Fixation Proceedings : జీతాలు ఇవ్వడంతో పిఆర్సి పని పూర్తి కాలేదు.. ఈ ప్రోసిడింగ్ ప్రతి ఉద్యోగి వద్ద ఉండాలి

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

PRC Fixation Proceedings : జీతాలు ఇవ్వడంతో పిఆర్సి పని పూర్తి కాలేదు.. ఈ ప్రోసిడింగ్ ప్రతి ఉద్యోగి వద్ద ఉండాలి

PRC Fixation Proceedings

న్యూస్ టోన్, అమరావతి : కొత్త పి ఆర్ సి అమలు చేసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి జీతాలు ఉద్యోగుల ఖాతా లకు జమ అయ్యాయి. ఈ కొత్త జీతాలు జమ అవ్వడంతో పిఆర్సి ప్రక్రియ ఇంకా పూర్తి అయినట్లు కాదు. పైగా ఈ కొత్త జీతాల అమలుకు నేరుగా జీతాలు జమ చేయడం సరైన పద్ధతి కూడా కాదు. 

పిఆర్సి ప్రక్రియ పూర్తి చేయడానికి సరైన పద్ధతిని అనుసరిస్తూ జీతాలను జమ చేయవలసి ఉంటుంది. పిఆర్సి విషయంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వలన ఈ ప్రక్రియ సరైన విధానంలో జరగలేదు. అయినప్పటికీ ఈ ప్రక్రియను సరైన విధానం లో పూర్తి చేయడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించ వలసి ఉంటుంది.

PRC Fixation Proceedings - Process

పిఆర్సి అమలు తేదీ అనగా 1-7-2018 నుండి జనవరి-2022 వరకు  పి ఆర్ సి-2015 లో ఉద్యోగి పే లో వచ్చిన మార్పులను సరి చూసుకోవాలి.

ఈ మార్పులకు తగిన విధంగా ఉద్యోగి సేవ పుస్తకం అనగా సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసి సంబంధిత డ్రాయింగ్ అధికారి సంతకం చేసి ఉండాలి. సేవా పుస్తకంలో నమోదు చేయవలసిన స్టాంపులను గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

Below Post Ad


ఇవే మార్పులను పేర్కొంటూ ప్రతి ఉద్యోగి కి వ్యక్తిగత కొత్త పిఆర్సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ను ఉద్యోగి కి అందించాలి. ప్రతి ఉద్యోగి పీఆర్సీ అమలు తేదీ నుండి వారి పే లో వచ్చే మార్పుల పై అవగాహన కలిగి ఉండాలి. 

PRC Fixation Proceedings - Excel Software

ప్రతి ఉద్యోగి కి వ్యక్తిగత కొత్త పిఆర్సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ను ఉద్యోగి కి అందించడానికి ఈ క్రింది ఎక్సెల్ సాఫ్ట్ వేర్ ఉపయోగ పడుతుంది. పి ఆర్ సి-2015 లో ఉద్యోగి పే లో వచ్చిన మార్పులను ఈ సాఫ్ట్ వేర్ లో పొందు పరచడం మరియు ఉద్యోగి వివరాలు ఇస్తే ప్రొసీడింగ్స్ జెనెరేట్ అవుతాయి. ఇక్కడ క్లిక్ చేసి పి.ఆర్.సి పే ఫిక్సేషన్ ప్రొసీడింగ్స్ ఎక్సెల్ సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకొండి. (Software Updated on 04.03.2022) 

PRC Fixation Proceedings - Example Proceedings


PRC Fixation Proceedings : జీతాలు ఇవ్వడంతో పిఆర్సి పని పూర్తి కాలేదు.. ఈ ప్రోసిడింగ్ ప్రతి ఉద్యోగి వద్ద ఉండాలి


Post a Comment

0 Comments