NPS Died after retirement CPS Employee Claim Instructions : సి.పీ.ఎస్ సొమ్ము ఆఫ్ లైన్ లో విత్ డ్రా కొరకు ఆదేశాలు
NPS Died after retirement CPS Employee Claim Instructions
న్యూస్ టోన్, అమరావతి : రిటైర్మెంట్ అయిన తరువాత సి.పీ.ఎస్ సొమ్ము ను విత్ డ్రా చేయకుండా చనిపోయిన సి.పీ.ఎస్ ఉద్యోగి యొక్క సొమ్మును ఆఫ్ లైన్ పద్ధతి లో విత్ డ్రా చేసుకునేందుకు సి ఆర్ ఏ ( Central Record Keeping Agency ) అవకాశం కలిపించింది. ఇటువంటి క్లెయిమ్స్ కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నందున అప్పటి వరకు ఆఫ్ లైన్ లో ఇలాంటి క్లెయిమ్స్ చేయాలని సి ఆర్ ఏ నిర్ణయించింది.
NPS Died after retirement CPS Employee Claim Instructions
ఈ మేరకు సి పీ ఎస్ నోడల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు . దీని కొరకు అటెస్ట్ చేయబడిన ఈ క్రింది ఫిజికల్ డాకుమెంట్స్ ను క్లెయిమ్ చేసుకునే వారు సమర్పించాలి.
- సంబంధిత ట్రెజరీ అధికారి కవరింగ్ లెటర్.
- నామినీ లేదా పిల్లలు లేదా లీగల్ హెయిర్ చేత పూర్తి చేయబడిన 103 జీ.డీ ఫామ్.
- సంబంధిత అధికారి చే జారీ చేయబడిన డెత్ సర్టిఫికెట్.
- సంబంధిత అధికారి చే జారీ చేయబడిన ఫామిలీ మెంబెర్ సర్టిఫికెట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా సక్సెసన్ సర్టిఫికెట్.
- క్లెయిమ్ చేసుకునే వారి బ్యాంకు పాస్ బుక్ లేదా క్యాన్సల్ల్డ్ చెక్ లేదా బ్యాంకు లెటర్ మరియు ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్.