Formative Assessment - 3 ( FA-3 ) Schedule Released : ఫార్మేటివ్ అసెస్మెంట్ షెడ్యూల్ విడుదల
- Formative - 4 Cancelled for this Academic Year
- Summative - 2 Will be conducted from April 22nd
- Prefinal Examinations for 10th Class will be held from April 4th
Formative Assessment - 3 ( FA-3 ) Schedule Released
న్యూస్ టోన్, అమరావతి : ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు నిర్వహించాల్సిన నిర్మాణాత్మక మూల్యాంకనం షెడ్యూల్ ను ఎస్.సి.ఈ.ఆర్.టి డైరెక్టర్ శ్రీ ప్రతాపరెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అందరికీ ఉత్తర్వులు అందాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింద పేర్కొన్న విధంగా టైం షెడ్యూల్ పాటిస్తూ నిర్వహణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
- మార్చి 14 నుండి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలి.
- మార్చి 18 నుండి 21 వరకు సమధాన పత్రాలు మూల్యాంకనం చేయాలి.
- మార్చి 21 నుండి 22 వరకు విద్యార్థుల సమాధాన పత్రాలను సంబంధిత తనిఖీ అధికారులు తనిఖీ చేయాలి.
- మార్చి 23 నుండి 27 వరకు మార్కులను ఆన్లైన్ ల అప్లోడ్ చేయడం
- మార్చి 22వ తేదీన తక్కువ సామర్థ్యం కలిగి ఉన్న విద్యార్థుల లిస్ట్ తయారుచేయడం.
పాఠశాలలు ఆగస్టు 16వ తేదీన ప్రారంభించడం వలన సిలబస్ తగ్గించడం జరిగింది. దీని కారణంగా ఈ విద్యా సంవత్సరానికి ఫార్మేట్ అసెస్మెంట్ 4 ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరానికి మూడు నిర్మాణాత్మక మూల్యాంకనాల ఆధారంగానే ప్రతిభ గణన జరుగుతుందని తెలిపారు.
ఏప్రిల్ 4వ తేదీ నుండి పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 వ తేదీ నుండి ఒకటవ తరగతి నుండి తొమ్మిదో తరగతి విద్యార్థుల కు సమ్మేటివ్ అసెస్మెంట్ నిర్వహించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనం 3 లో వెనకబడిన విద్యార్థులకు రేమిడియల్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పరీక్షలు సజావుగా, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంద శాతం మార్కులను ఆన్లైన్ చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. Click Here to Download FA-3 Schedule Proceedings. Scroll down for Schedule Image. Click Here to Download FA-3 Syllabus
[post_ads]
All subjects question papaers in 9th class em F.A.3
ReplyDelete