Receiving of Rice from FP Shops Instructions : HM లు వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి.
Receiving of Rice from FP Shops Instructions
న్యూస్ టోన్, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు/ ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని పాఠశాలలకు బియ్యం కేటాయింపు జరగకపోవడం గమనించారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు చౌక ధరల దుకాణం నుండి వేలిముద్ర వేయకుండా మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఈ ఇబ్బంది తలెత్తుతుందని గమనించారు. బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రధానోపాధ్యాయులు ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు. న్యూస్ టోన్.in
గతంలో ఇలా ప్రధానోపాధ్యాయులు మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తిన క్రమంలో రెండుసార్లు ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సరి చేయడం జరిగింది.
ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు. న్యూస్ టోన్.in
ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన అంశాలు
- ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.
- ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.
- చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. న్యూస్ టోన్.in
ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షం లో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయుల పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి.
[post_ads]