Mother Tongue Festival : ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ
Mother Tongue Festival
న్యూస్ టోన్, అమరావతి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ న అన్ని విద్యాసంస్థల్లో మాతృభాష దినోత్సవాన్ని జరపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు.
మాతృభాష దినోత్సవ సందర్భంగా భాషా అంశాలపై ప్రాచుర్యం కల్పించడం, భాషలకు సంబంధించిన సంస్కృతి, ప్రేరణ కల్పించే అంశాలు, సహనం లాంటివి నేర్పించాలని ఆదేశించారు.
భారతదేశంలో భాషా వైవిధ్యం గురించి, మాతృభాషతో పాటు ఇతర భాషలను నేర్పడం గురించి భిన్న సంస్కృతులు వివిధ కళలు రచనలు సృజనాత్మక వ్యక్తీకరణలు ఈ కార్యక్రమం లో భాగంగా ఉండాలి.
Mother Tongue Festival - పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు
మాతృభాష దినోత్సవ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో పోస్టర్లను తయారు చేయడం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు, డిబేట్, పాటలు, నాటికలు, ఎగ్జిబిషన్ మరియు భాషకు సంబంధించిన ఇతర అంశాలను నిర్వహించాలని తెలిపారు.
పాఠశాలలో నిర్వహించిన మాతృభాష దినోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది గూగుల్ ఫామ్ లో నింపాలని తెలిపారు
Click Here for Google Form ( This Google form for State Level Data Entry )