Trending

6/trending/recent

MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌.. ఆ కేసులో భాగంగా అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు..

టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి 12.15 గంటలకు ఆయనను అరెస్టు చేశారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని అశోక్‌ బాబుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్సీ అరెస్టుపై టీడీపీ స్పందించింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్‌ చేసిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి: చంద్రబాబు

ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్‌ విషయంలో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని.. అర్ధరాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని  చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే  ప్రభుత్వం కక్షగట్టిందన్నారు.  అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు  టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్  తెలిపారు.  జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు తగిన మూల్యం చెల్లిస్తుందని.. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే కక్ష సాధింపు చర్య అని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన

టీడీపీ  సీనియర్ నేత ధూళిపాళ్ల నరెంద్ర కుమార్  ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును ఖండించారు.  ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాన అంశాలపై చర్చను దారి మల్లించేందుకే ఈ అరెస్టు నాటకమాడుతోందన్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తిని అర్థ రాత్రి అరెస్టు చెయ్యాల్సిన  అవసరం ఏమోచ్చిందని ఆయన ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యోగ, ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా అబద్ధపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి అరాచకంతో పాలన సాగిస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారన్నారు. అశోక్ బాబును అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటిని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గతంలో అశోక్ బాబు పై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.  ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యంవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష్యసాధిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు..

ఎమ్మెల్సీ అశోక్ బాబు అక్రమ అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఖండించారు. ఉద్యోగులలో ప్రభుత్వం పై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు అరెస్ట్ జరిగిందన్నారు.  ఉద్యోగులు హక్కుల కోసం మాట్లాడమే అశోక్ బాబు చేసిన నేరమా ? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.  అక్రమ అరెస్ట్ లతో ప్రజా వ్యతిరేకతను ఆపలేరని,  వైసీపీ  ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.
MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌.. ఆ కేసులో భాగంగా అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు..

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad