Trending

6/trending/recent

Grama Volunteers Ward Volunteers Appointment Instructions : గ్రామ వార్డు వాలంటీర్ ల ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశాలు

Grama Volunteers Ward Volunteers Appointment Instructions : గ్రామ వార్డు వాలంటీర్ ల ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశాలు

Grama Volunteers Ward Volunteers Appointment Instructions

న్యూస్ టోన్, అమరావతి : ప్రభుత్వం నవరత్నాలు అనే పేరుతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో 15004 విలేజ్ వార్డ్ సచివాలయాల్లో దాదాపు రెండు లక్షల 66 వేల గ్రామ వార్డు వాలంటీర్ నియామకాలను చేపట్టింది.

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ముఖ్య భూమిక పోషిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల వేకెన్సీ లను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఇప్పటికే జాయింట్ కలెక్టర్ లను ప్రభుత్వం ఆదేశించింది. ఎవరైనా ఒక వాలంటీర్ వరుసగా మూడు రోజులు తగిన సమాచారం లేకుండా విధులకు హాజరు కానట్లయితే తరువాతి ఏడో రోజున ఆ వాలంటీరు పనిచేసే స్థానాన్ని ఖాళీ గా గుర్తించి భర్తీ చేయాల్సి ఉంటుంది.

ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7218 ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించారు. మరియు వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి చర్యలు కూడా తీసుకోవడం లేదని గుర్తించారు. దీనితో ఆ గ్రామాల్లో ఆ వార్డుల్లో ప్రభుత్వ పథకాల అమలులో కొంత వెనకబాటు కనబడుతుంది.

Grama Volunteers Ward Volunteers Appointment Instructions

దీన్ని నివారించడానికి నెలకు రెండుసార్లు ఖాళీ అయ్యే వాలంటీర్ల స్థానాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెల ఒకటవ తేదీ మరియు 16వ తేదీ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది.

కొన్ని చోట్ల వాలంటీర్ల నియామకానికి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేకపోవడంతో ఇప్పటి వరకు మండలం లేదా అర్బన్ ఏరియా కు బదులుగా జిల్లా యూనిట్గా తీసుకుని ఈ నియామకాలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వాలంటీర్ల నియామకం చేసే సమయంలో 50 శాతం పోస్టులు స్త్రీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇకపై మండలం లేదా అర్బన్ లోకల్ బాడీ బదులుగా జిల్లా యూనిట్గా ఈ నియామకాలు చేయాల్సి ఉంటుంది.

Grama Volunteers Ward Volunteers Appointment Instructions

ఒక ప్రదేశంలో తగిన అర్హతలు కలిగిన అభ్యర్థి లేనట్లయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఏది ఏమైనా జిల్లా యూనిట్ గా తీసుకున్నప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ వారీగా సరి పోవాల్సి ఉంటుంది.

మిగిలిన అన్ని మార్గదర్శకాలు మరియు గ్రామ వాలంటీర్ల విధులు గతంలో సూచించిన విధంగానే ఉంటాయి. కావున ఈ తాజా మార్గదర్శకాలతో జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే వాలంటీర్ల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి వాలంటీర్ల భర్తీకి సంబంధించిన తాజా మార్గదర్శకాలు డౌన్లోడ్ చేసుకోండి
[post_ads]

Grama Volunteers Ward Volunteers Appointment Instructions : గ్రామ వార్డు వాలంటీర్ ల ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశాలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad