PRC Discussions : ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదన్నారు.
PRC Discussions
ఉద్యోగులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం రాదన్నారు. సమ్మెకు వెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్ట విరుద్ధమని తెలిపారు.
రేపట్నుంచి ప్రతి రోజూ 12 గంటలకు అందుబాటులో ఉంటామన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు.. మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలెవరు వచ్చిన చర్చలకు సిద్దమన్నారు.
చర్చలకు రమ్మనే మేం కోరుతున్నామని సజ్జల వెల్లడించారు. బాధ్యత కలిగిన నేతలు ఇమ్మెచ్యూర్ గా వ్యవహరించడం మంచిది కాదన్నారు.
అయినా చర్చలకు రాకపోవడం బాధాకరం అని తెలిపారు. ప్రభుత్వం నాలుగుమెట్లు దిగడానికి సిద్ధంగానే ఉందని చెప్పారు. రెచ్చగొట్టే మాటలను మేం పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
ఉద్యోగ సంఘాలు మొండివైఖరితో వ్యవహరించొద్దని సజ్జల చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మాకు శత్రువులు కాదన్నారు.
అగ్నికి ఆజ్యం పోసే అంశాలపై మేం మాట్లాడామన్నారు.పే స్లిప్పులు వస్తే ఎంత పెరిగిందో.. ఎవరికి తగ్గిందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్ పాజిటీవ్ గా ఉండే వ్యక్తి అని.. చర్చలకు వెళ్లాల్సిందిగా నేతలకు ఉద్యోగులూ చెప్పాలన్నారు.
ఉద్యోగుల లేఖ ఇచ్చిన రోజే ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని చెప్పాం.. కానీ చర్చలకు వారే రాలేదన్నారు.
నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దిగలేదు జీతభత్యాలు న్యాయబద్ధంగా లేనప్పుడు సమ్మె చేయడం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు హక్కు అని అదే సుప్రీంకోర్టే స్పష్టం చేసింది ఇంకా మేము చర్చలకు ఆహ్వానిస్తూ ఉంటే ఉద్యోగ సంఘ నాయకులు చర్చలకు రాలేదు అని అనవసరమైన ఉప వాదులు వేస్తున్నారు కానీ ఉద్యోగ సంఘాలు కోరినట్టు మొదటగా అర్ధరాత్రి జీవోలను రద్దు చేయ లేదని కొత్త DA లతో కూడిna పాత జీతాలను చెల్లించలేదని హెచ్ ఆర్ ఎ స్లాబు లలో మార్పు చేయలేదని ఉద్యోగ సంఘ నాయకులు చర్చలకు రాలేదు అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుంది ఎల్లవేళలా ప్రతి తప్పు ఉద్యోగుల మీద ఉద్యోగ సంఘ నాయకుల మీద వేస్తున్నారే తప్ప అసలైన తప్పుల్ని మీరు ఒప్పుకోవడం లేదు
ReplyDelete